SS Rajamouli tweets on Ram charan Thani Oruvan

Ss rajamouli tweets on ram charan thani oruvan

Rajamouli comments on Ram Charan Thani Oruvan Film, Rajamouli comments on Thani Oruvan, Ram Charan Thani Oruvan Film News, Rajamouli tweets, Rajamouli comments, Ram Charan movie news, Ram Charan movie stills, Ram Charan

SS Rajamouli tweets on Ram charan Thani Oruvan: Ram Charan Upcoming film Tamil block buster hit Thani Oruvan. Surendhar reddy direction.

జక్కన్న ప్రశంసలను రాంచరణ్ అందుకోగలడా?

Posted: 11/12/2015 02:06 PM IST
Ss rajamouli tweets on ram charan thani oruvan

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి ఏ సినిమాపైన కామెంట్ చేసిన కూడా.. ఆ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడటం తెలిసిందే. గతంలో సంపూర్ణేష్ బాబు అంటే ఎవరో తెలియని వ్యక్తి.. కేవలం రాజమౌళి ట్వీట్ వల్ల భారీగా క్రేజ్ దక్కించుకొని, ‘బర్నింగ్ స్టార్’ గా టాలీవుడ్ లో కొనసాగుతున్నాడు. అంతేకాకుండా రాజమౌళి ఏదైనా సినిమా గురించి పొగిడితే ఆ సినిమాకు సైతం క్రేజ్ రావడం సర్వసాధరణమే. కానీ ఇపుడు అలాంటి రాజమౌళి కామెంట్ల వల్ల చరణ్ ఇబ్బందుల్లో పడే పరిస్థితి ఏర్పడింది.

అదేంటంటే... గతకొద్ది కాలంగా మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ నటించిన సినిమాలేవి కూడా భారీ విజయం సాధించడం లేదు. ‘ఎవడు’ తర్వాత చరణ్ నటించిన ‘గోవిందుడు అందరివాడేలే’, తాజాగా ‘బ్రూస్ లీ’ సినిమాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేవు. దీంతో తమిళంలో ఘన విజయం సాధించిన ‘థని ఒరువన్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు చరణ్.

అయితే ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చరణ్ చాలా కసిగా వున్నాడు. తమిళంలో విజయం సాధించిన సినిమాను తెలుగులోకి రీమేక్ చేసి, హిట్టు కొట్టాలంటే ఎంతో శ్రమపడాలి. అందుకు తగ్గట్లుగా ఈ రీమేక్ కోసం దర్శకుడు సురేంధర్ రెడ్డి చాలా జాగ్రత్తలు తీసుకొని, స్ర్కిప్టు పనుల్లో బిజీగా వున్నారు. కానీ ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే రాజమౌళి తన మాటలతో అంచనాలు పెంచేస్తున్నారు.

రాజమౌళి ఇటీవలే ‘థని ఒరువన్’ సినిమాను వీక్షించాడట. ఈ సినిమా చాలా బాగుందని, అరవింద్ స్వామి యాక్టింగ్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్ అంటూ కామెంట్లు చేసారు. రాజమౌళి కామెంట్ చేసిన ఈ సినిమాలో తెలుగులో రీమేక్ చేయబోతున్నారని తెలియడంతో... ఈ రీమేక్ ఎలా వుండబోతుందోనని అభిమానుల్లో ఇప్పటినుంచే అంచనాలు మొదలయ్యాయి. మరి ఈ అంచనాలను చరణ్ అందుకుంటాడో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Rajamouli  Tweets  Thani Oruvan Remake  

Other Articles