Asin to tie the knot with beau Rahul Sharma on November 26

Asin to marry in delhi on november 26

asin, rahul sharma, asin wedding, asin solitaire, micromax founder rahul sharma, asin marriage, asin rahul sharma, asin fiance, asin news, asin engagement, asin marriage plans, asin movies, all is well, rahul sharma marriage, entertainment news

Asin's wedding date has finally been fixed with her beau Rahul Sharma, also a CEO of Micromax, on November 26 in Delhi.

వచ్చె నెల 26న పెళ్లీపీటలు ఎక్కతుందట..!

Posted: 10/25/2015 08:53 PM IST
Asin to marry in delhi on november 26

'గజనీ' సినిమాతో ఇటు దక్షణాది వారిని, అటు బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ అసిన్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. వచ్చేనెల 26న తన చెలికాడు రాహుల్‌ శర్మను మనువాడనున్నారు. ఈ మేరకు వారి పెళ్లి ముహూర్తం ఖరారైనట్లు తెలిసింది. న్యూఢిల్లీలోని ఓ ప్రముఖ హోటల్‌లో వీరి వివాహం జరుగనుంది. నవంబర్ 27న ఢిల్లీలోని వెస్ట్ ఎండ్ గ్రీన్స్ ఫార్మ్‌హౌజ్‌లో ఈ జంట అతిథులకు రిసెప్షన్ ఇవ్వనుంది.

ఈ వేడుకలో కుటుంబసభ్యులు, సన్నిహిత మిత్రులు మాత్రమే పాల్గొనున్నారు. ఇదే ఫామ్‌హౌజ్‌లో గతంలో షాహిద్, మీరాల రిసెప్షన్ జరిగింది. నవంబర్ 28న ముంబైలో ఈ దంపతులు మరో రిసెప్షన్ ఇవ్వనున్నారు.  మైక్రోమాక్స్ సహ స్థాపకుడైన రాహుల్‌ శర్మ-అసిన్ కొంతకాలంగా స్నేహంగా ఉంటున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ ఆసిన్ ఇప్పటికే ఎంగేజ్ మెంట్ చేసుకుందట. ఇక ఆలస్యం చేయకుండా ఒక్కటవ్వాలనుకున్నారు ఈ జంట. ఈ నేపథ్యంలో ఇద్దరి మనస్సులు కలువడంతో పెళ్లికి ఒప్పుకున్నట్టు తెలుస్తున్నది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Asin  Rahul Sharma  wedding  Micromax  

Other Articles