Tollywood Comedian Mada Venkateswara Rao Passes Away

Telugu actor mada venkateswara rao passes away

mada venkateswara rao, mada venkateswara rao dies, mada venkateswara rao passes away, mada venkateswara rao death, mada venkateswara rao news, mada venkateswara rao films, mada venkateswara rao movies

Mada Venkateswara Rao has acted in over 300 films, including some films of other regional languages.

హాస్యనటుడు మాడా వెంకటేశ్వరరావు కన్నమూత

Posted: 10/25/2015 11:36 AM IST
Telugu actor mada venkateswara rao passes away

ప్రముఖ హాస్యనటుడు మాడా వెంకటేశ్వరరావు(65) కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఈనెల 17న అపోలో ఆసుపత్రిలో చేరి వైద్య చికిత్స తీసుకొంటున్నారు. క్రితం రోజు రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఆయన మరణించారు. ‘మాడా’ గా తెలుగు ప్రజలకు సుపరిచితులయిన ఆయన పూర్తి పేరు మాడా వెంకటేశ్వర రావు. తూర్పుగోదావరి జిల్లాలోని కడియం మండలంలో దుళ్ల గ్రామంలో 1950 అక్టోబర్ 10న జన్మించారు. ఆయనకు నలుగురు కుమార్తెలున్నారు.

మాడా వెంకటేశ్వర రావు సినీ పరిశ్రమలో ప్రవేశించే ముందు నాటక రంగంలో తన ప్రతిభను చాటుకొన్నారు. దర్శకుడు బాపు ఆయన ప్రతిభను గుర్తించి తన సినిమాలలో అవకాశం కల్పించారు. నాటక రంగానికి రాక పూర్వం మాడా వెంకటేశ్వర రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖలో ఇంజనీరుగా పనిచేసేవారు. బాపు సహాయంతో సినీ పరిశ్రమలో ప్రవేశించిన మాడా తెలుగు సహా పలు బాషా చిత్రాలలో సుమారు 300కి పైగా సినిమాలలో నటించారు. మాడా మరణంతో తెలుగు సిని పరిశ్రమలో విషాధ చాయలు అలుముకున్నాయి

ముత్యాల ముగ్గు, చిల్లర కొట్టు చిట్టెమ్మ, లంబాడోళ్ళ రాందాసు వంటి సినిమాలు ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఆర్జించిపెట్టాయి. ముఖ్యంగా 1977 సం.లో విడుదలయిన దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన ‘చిల్లర కొట్టు చిట్టెమ్మ’ సినిమాలో ‘పువ్వుల కొమ్మయ్య’ అనే నపుంసక పాత్ర, దానికి ఆయన చేసిన ‘చూడు పిన్నమా...పాడు పిల్లోడు..’అనే పాట ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఆ తరువాత ఆయన ఎన్ని విభిన్నపాత్రలు పోషించినప్పటికీ మాడా అంటే చటుక్కున అందరికీ అదే పాత్ర గుర్తుకు వస్తుంది. అంత అద్భుతంగా ఆయన ఆ పాత్ర చేసారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mada Venkateswara Rao  Tollywood Comedian  Passes Away  

Other Articles