The Audio Venue Of Bruce Lee Movie Is Finalised | Rakul Preet Singh | Ram Charan News | Megastar Chiranjeevi Updates

Bruce lee movie audio release venue finalised riya riya song making video rakul preet singh

bruce lee audio venue, bruce lee movie udpates, bruce lee movie news, bruce lee movie audio, bruce lee audio release, bruce lee charan movie, ram charan bruce lee updates, rakul preet singh, srinu vaitla, megastar chiranjeevi

Bruce Lee Movie Audio Release Venue Finalised Riya Riya Song Making Video Rakul Preet Singh : The Audio Venue Of Bruce Lee Movie Is Finalised.

మేకింగ్ వీడియో రిలీజ్.. పాటల సందడికి వేదిక ఫిక్స్!

Posted: 10/01/2015 11:25 AM IST
Bruce lee movie audio release venue finalised riya riya song making video rakul preet singh

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘బ్రూస్ లీ’. గతకొంతకాలం నుంచి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఆడియోని గాంధీజయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన విడుదల చేస్తున్నారు. అయితే.. నిన్నటిదాకా ఈ ఆడియో ఫంక్షన్ ను ఎక్కడ నిర్వహిస్తారో సస్సెన్స్ గా వుంచిన యూనిట్.. తాజాగా ఆ వేదిక వివరాలను వెలువరించింది. హైదరాబాద్ లోని హైటెక్స్ గ్రౌండ్ లో ఘనంగా ఈ ఈవెంట్ ని నిర్వహించనున్నారు. టాలీవుడ్ నుంచి టాప్ సెలబ్రిటీలతోపాటు ఇతర ప్రముఖులు హాజరు కానున్న నేపథ్యంలో ఈ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఇప్పటికే వేదిక నిర్వహణ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని తెలిసింది.

ఇదిలావుండగా.. ఈ చిత్రానికి సంబంధించి ‘రియా..’ పేరిట ఓ పాట మేకింగ్ వీడియోని యూనిట్ విడుదల చేసింది. ఆ మేకింగ్ వీడియోలో చెర్రీ చేసిన స్టెప్పులు అద్భుతంగా వున్నాయంటూ అప్పుడే అభిమానుల నుంచి కితాబు అందుతోంది. ఇంకొక విషయం ఏమిటంటే.. రామోజీ ఫిల్మ్‌ సిటీలో 'మెగా మీటర్‌...' అనే పాటని తెరకెక్కించారు. ఆ పాట కోసం రామ్‌చరణ్‌ ఏకధాటిగా 17 గంటలపాటు చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఆ విషయాన్ని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఇదివరకే ‘లే చలో’ అనే సాంగు విడుదలైన విషయం తెలిసిందే! ఆ పాటకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో వున్న మిగతా పాటలు కూడా ప్రేక్షకుల్ని అలరిస్తాయని యూనిట్ భావిస్తోంది. మరి.. అందులో ఎంత వాస్తవం వుందో తెలియాలంటే ఆడియో రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే!

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. బ్రూస్ లీకి వీరాభిమాని అయిన యువకుడి పాత్రలో నటిస్తున్న చెర్రీ.. పవర్ఫుల్ ఫైటర్ గా కనువిందు చేయనున్నాడు. ఇక ఇందులో మెగాస్టార్ చిరంజీవి మూడు నిముషాలపాటు గెస్ట్ పాట్రలో నటిస్తున్న విషయం తెలిసిందే! దీంతో ఈ సినిమా క్రేజ్ ఒక్కసారిగా భారీగా పెరిగిపోయింది. చాలాకాలం తర్వాత మేకప్ వేసుకుని, కెమెరాముందుకొచ్చిన చిరు.. వెండితెరపై ఎలా వుంటాడోనన్న ఆతృత అభిమానులతోపాటు సినీ వర్గాల్లో పెరిగింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bruce lee audio event  megastar chiranjeevi  ram charan updates  

Other Articles