మెగాపవర్ స్టార్ రాంచరణ్, రకూల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రూస్ లీ’. ‘ది ఫైటర్’ అనేది ట్యాగ్ లైన్. ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో డివివి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
తాజాగా ఈ చిత్ర ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో శ్రీనువైట్ల, డివివి దానయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ... ముందుగానే అనౌన్స్ చేసినట్లుగానే ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న విడుదల చేస్తున్నాం. ఆడియోను అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేస్తున్నాం. చిరంజీవి గారి పాత్ర గురించి అభిమానులకు సర్ప్రైజ్ గా వుండాలని రివీల్ చేయడం లేదు. హీరో ఈ సినిమాలో బ్రూస్ లీ కి పెద్ద ఫ్యాన్ కాబట్టే ఆ టైటిల్ ను పెట్టాం. ఫైటర్ అనే ట్యాగ్ లైన్ పెట్టడానికి గల కారణం మాత్రం ఒక ఆర్డినరీ మ్యాన్, ఎక్స్ ట్రా ఆర్డినరీ సమస్య వచ్చినపుడు అందులో నుంచి ఎలా బయటపడ్డాడనేదే సినిమా. రెండు సాంగ్స్, చిన్న టాకీ పార్ట్ మినహా సినిమా అంతా పూర్తయ్యింది. నా పుట్టినరోజు సెప్టెంబర్24న ఒక నిమిషం నిడివి గల సాంగ్ టీజర్ ను విడుదల చేయడానికి నిర్మాత దానయ్య సన్నాహాలు చేసారు.
భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్లు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఈ చిత్రానికి కథను కోన వెంకట్, గోపి మోహన్ లు అందిస్తున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను అక్టోబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more