Manchu Vishnu | DYNAMITE | Movie Censor Completed | Trailer | Pranitha Subhash

Manchu vishnu dynamite movie release on 4 september

DYNAMITE Movie Censor Completed, DYNAMITE Movie Trailer, DYNAMITE Movie Teaser, DYNAMITE Movie News, DYNAMITE Movie Updates, Manchu Vishnu movies, Manchu Vishnu movie news, Manchu Vishnu news, Manchu Vishnu stills, Manchu Vishnu latest updates, Manchu Vishnu

Manchu Vishnu DYNAMITE Movie Release on 4 September: Dynamite is being presented by Ariaana and Viviana, Produced by Twenty Four Frames Factory.Dynamite is directed by Deva Katta and produced by Manchu Vishnu under the banner 24 Frames Factory featuring himself and Pranitha Subhash in the lead roles.

మంచు విష్ణు యాక్షన్ హైలైట్ గా డైనమైట్

Posted: 08/31/2015 10:07 AM IST
Manchu vishnu dynamite movie release on 4 september

మంచు విష్ణు హీరోగా, నిర్మాతగా డిఫరెంట్ చిత్రాల్లో నటిస్తూ, నిర్మిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ప్రతి సినిమాలో డిఫరెంట్ లుక్, స్టయిల్ తో ఆకట్టుకున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రస్తుతం దేవాకట్టా దర్శకత్వంలో యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ 'డైన‌మైట్' సినిమాని రూపొందించారు. విష్ణు పెర్ ఫార్మెన్స్, లుక్ కి సరిపొయే విధంగా ఈ సినిమాకి ఈ టైటిల్ ను ఫిక్స్ చేశారు.

ఈ సినిమా కోసం మంచు విష్ణు చెవి పోగు,చేతి పొడవునా టాటూతో డిఫరెంట్ లుక్ తో కనువిందు చేయనున్నారు. అలాగే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుని చేశారు. విష్ణు స‌ర‌స‌న గ్లామ‌ర‌స్ హీరోయిన్ ప్రణీత హీరోయిన్‌గా న‌టించింది. మంచు విష్ణు న‌ట‌న‌, లుక్‌, ఫైట్ మాస్టర్ విజ‌యన్ అందించిన యాక్షన్ సీక్వెన్స్‌, దేవాక‌ట్టా టేకింగ్, ప్రొడ‌క్షన్ వాల్యూస్ హైలైట్ గా ఉంటాయని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.

ఇటీవలే అచ్చు సంగీతం అందించిన పాటలకు, థియేట్రికల్ ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్ ను పొందింది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్నారు. విజయన్ మాస్టర్ నేతృత్వంలో విష్ణు చేసిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో బావుందని సెన్సార్ సభ్యులు ప్రశంసలు అందించారు.

ఫెంటాస్టిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మంచి కథ, మ్యూజిక్, యాక్షన్, మంచు విష్ణు హై వోల్టేజ్ ఫెర్ ఫార్మెన్స్ ఉన్న ఈ సినిమా తిరుగులేని సక్సెస్ ను అందుకుంటుందని ట్రేడ్ వర్గాల అంచనా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Vishnu  DYNAMITE  Movie Censor Completed  Trailer  Pranitha Subhash  

Other Articles

Today on Telugu Wishesh