Akhil Akkineni Film Release Date Confirmed

Akhil akkineni film release date confirmed

Akhil Akkineni Film Audio Release Date, Akhil Akkineni Film Nizam rights sold, Akhil Akkineni movie news, Akhil Akkineni movie updates, Akhil Akkineni latest details, Akhil Akkineni stills, Akhil Akkineni latest movies, Akhil Akkineni news, Akhil Akkineni stills, Akhil Akkineni gallery

Akhil Akkineni Film Release Date Confirmed: Akhil Akkineni latest film under VV Vinayak direction. nithin producer. Sayesha saigal heroine. thaman and anoop music.

అక్కినేని అఖిల్ సినిమా, ఆడియో విడుదల తేది ఖరారు

Posted: 08/01/2015 05:18 PM IST
Akhil akkineni film release date confirmed

అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. అఖిల్ హీరోగా ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై హీరో నితిన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

అఖిల్ సరసన సయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే 85% షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆగష్టు 4వ తేది నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. టైటిల్, ట్రైలర్, ఫస్ట్ లుక్ విడుదల కాకుండానే ఈ చిత్ర నైజాం హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి.

ఈ చిత్రానికి థమన్, అనూప్ సంగీతం అందిస్తున్నారు. అయితే తాజాగా ఆడియో మరియు చిత్ర విడుదల తేదిలను ప్రకటించింది చిత్ర యూనిట్. సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆడియో విడుదల చేయనున్నారు. ఇక అక్టోబర్ 21న సినిమాను గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది.

కమర్షియల్ యాక్షన్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా అఖిల్ కు మంచి హిట్ దక్కుతుందని చిత్ర యూనిట్ చాలా ధీమాగా వున్నారు. మరి ఈ చిత్రం ఎలా వుండబోతుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akhil Akkineni  Audio Date  Release Date  Nithin  Sayesha Saigal  stills  

Other Articles