Rana Daggubati plans in Leader sequel

Rana daggubati plans in leader sequel

Rana in Leader film sequel, Rana in Leader sequel, Rana in Leader sequel news, Rana movie news, Rana movie updates, Rana latest news, Rana film updates, Rana new movie details, Rana stills, Rana

Rana Daggubati plans in Leader sequel: Rana Daggubati first film Leader. Shekhar kammula direction. now Rana trying to do sequel Leader film.

రానా కోసం లీడర్ కథ రెడీ అవుతుందట!

Posted: 07/31/2015 10:44 AM IST
Rana daggubati plans in leader sequel

ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి రానా ‘లీడర్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రానా ఓ పొలిటీషియన్ గా కనిపించాడు. కానీ ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించక, అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

ఒకసారి ఫ్లాప్ అయిన చిత్రాల వైపు ఏ హీరో కూడా వెళ్లడానికి సిద్ధపడడు. కానీ రానా మాత్రం మళ్లీ అలాంటి సినిమానే చేయాలని కోరుకుంటున్నాడు. త్వరలోనే మళ్లీ ‘లీడర్’ సీక్వెల్ లో కనిపించబోతున్నట్లుగా రానా తాజాగా ట్వీట్ చేసాడు.

రానా చెప్పిన తాజా సమాచారం ప్రకారం... ప్రస్తుతం ‘లీడర్’ సినిమా సీక్వెల్ కోసం కథను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం స్ర్కిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని రానా తెలిపాడు. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లనుందో త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా తెలియనున్నాయి.

ప్రస్తుతం రానా ‘బెంగళూర్ డేస్’ రీమేక్ లో నటిస్తున్నాడు. అలాగే సెప్టెంబర్ నుంచి ‘బాహుబలి2’ షూటింగ్ లో పాల్గొననున్నాడు. మరి ఈ రెండు చిత్రాల తర్వాత రానా ‘లీడర్’ సీక్వెల్ లో నటిస్తాడేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rana  Leader  Sequel  movie news  tweets  

Other Articles