Mahesh Babu Srimanthudu Movie Audio Review

Mahesh babu srimanthudu movie audio review

Mahesh Srimanthudu Audio Review, Mahesh Srimanthudu Audio, Mahesh Srimanthudu Songs, Mahesh Srimanthudu Audio Track List, Srimanthudu Movie Latest stills, Srimanthudu latest posters, Srimanthudu latest news, Srimanthudu songs, Srimanthudu audio, Srimanthudu news, Srimanthudu

Mahesh Babu Srimanthudu Movie Audio Review: Mahesh Babu Srimanthudu Audio Released today. Devi sri prasad Music. Koratala shiva director, Shruti haasan heroine. Audio will be release on 18 july.

మహేష్ బాబు శ్రీమంతుడు ఆడియో రివ్యూ

Posted: 07/18/2015 03:16 PM IST
Mahesh babu srimanthudu movie audio review

మహేష్ బాబు, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘శ్రీమంతుడు’. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను జులై 18న గ్రాండ్ గా హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో విడుదల చేయనున్నారు. అయితే ఆడియో విడుదలకు కొన్ని గంటల ముందుగానే ఈ చిత్ర పాటలు ఇంటర్నెట్ లో విడుదలయ్యాయి. మరి ‘శ్రీమంతుడు’ పాటలు ఎలా వుందో ఒకసారి చూద్దామా!

ఈ చిత్రంలోని అన్ని పాటలకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.

1. రామ రామ రామ రామ
ఆడియో ట్రాక్ లో ఇది మొదటి పాట. ఈ పాటను సూరజ్ సంతోష్, రైనా రెడ్డి పాడారు. ఈ పాట ఏదో రాముని వేడుక సంధర్భంగా వచ్చే పాట అన్నట్లుగా అనిపిస్తుంది. మంచి మాస్ బీట్ తో మొదలవుతుంది. అలాగే రామాయణంలోని కొన్ని అంశాలను అందరికి అర్థమయ్యే విధంగా ఈ పాటలో వివరించారు. భక్తి పాటవలే అనిపించే మంచి సాహిత్యమున్న పాట ఇది. శ్రీరాముడి గొప్పతనాన్ని గురించి ఈ పాటలో వినవచ్చు. మొత్తానికి మాస్ బీట్ తో ఈ పాట చాలా బాగుంది.

2. జత కలిసే
రెండవ పాట ఇది. ఈ పాటను సాగర్ మరియు సుచిత్ర ఆలపించారు. ఈ పాటలో హీరోహీరోయిన్లు ఇద్దరూ ప్రేమలో పడే సన్నివేశంలో వచ్చే పాట అన్నట్లుగా అనిపిస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ప్రేమలో పడుతున్నారంటూ చక్కని సాహిత్యంతో తీర్చిదిద్దారు. సాగర్, సుచిత్రలు ఈ పాటను అద్భుతంగా పాడారు. చాలా మెలోడీగా సాగే ఈ పాట ముఖ్యంగా ప్రేమికులకు, యువతకు బాగా నచ్చుతుంది. అలాగే వినడానికి కూడా చాలా వినసొంపుగా వుంది.

3. చారుశీల
మూడవ పాట ఇది. ఈ పాటను యాజిన్ నిజర్ పాడారు. వెస్ట్రన్ స్టైల్ లో సాగే పాట ఇది. చాలా స్టైలిష్ గా కంపోజ్ చేసారు. హీరోయిన్ తో ప్రేమలో పడ్డ తర్వాత హీరో పాడే పాట ఇది. సాహిత్యం చాలా చక్కగా వున్నప్పటికీ మాత్రం సంగీతం మాత్రం చాలా స్టైలిష్ గా కంపోజ్ చేసాడు దేవిశ్రీప్రసాద్. అంతేకాకుండా ఈ పాటలో వచ్చే ‘ర్యాప్’ ను కూడా దేవి రాసి, పాడారు. మొత్తానికి ఓ స్టైలిష్ వెస్ట్రన్ స్టైల్ లో ప్రేమికుడు తన ప్రేయసి గురించి పాడుకునే పాట ఇది.

4. శ్రీమంతుడా...
నాల్గవ పాట ఇది. ఈ పాటను ఎంఎల్ఆర్ కార్తికేయన్ పాడారు. ఈ పాట చాలా అద్భుతంగా వుంది. ముఖ్యంగా సాహిత్యం చాలా బాగుంది. సినిమాలో హీరో పాత్ర మారే తీరుతెన్నుల గురించి చాలా చక్కగా తెలిపారు. శ్రీమంతుడా అనే టైటిల్ సాంగ్ ను చాలా సింపుల్ గా, చక్కగా ఆకట్టుకున్నారు. ఈ పాట సినిమాలో వచ్చే పలు సన్నివేశాలతో వుండనుందని ఊహించుకోవచ్చు.

5. జాగో... జాగోరే...
ఐదవ పాట ఇది. ఈ పాటను రఘు దీక్షిత్ పాడారు. స్టైలిష్ మాస్ బీట్ తో ప్రారంభమయ్యే ఈ పాట చాలా బాగుంది. ఈ పాట కూడా సినిమాలో వచ్చే పలు సీన్లతోనే వచ్చే పాటగా ఊహించుకోవచ్చు. హీరో తనను తాను తెలుసుకొనే ప్రయత్నంలో ఈ పాట వస్తుందని అనుకోవచ్చు. స్టైలిష్ కంపోజింగ్ తో చక్కని సాహిత్యాన్ని అందించారు. ముఖ్యంగా పాట పల్లవి, చరణాల ప్రారంభానికి ముందు వచ్చే మాస్ బీట్ చాలా బాగుంది. ఈ బీట్ ఇప్పటికే భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది.

6. దిమ్మతిరిగే...
ఇది ‘శ్రీమంతుడు’ ఆల్బంలో చివరి పాట. ఈ పాటను సింహా మరియు గీతామాధురి ఆలపించారు. ఈ పాట ప్రారంభం వింటేనే ఇదొక మాస్ మసాలా సాంగ్ అని అర్థమవుతుంది. ఈ పాట వింటే అంత కిక్కు అనిపించలేదు. అంతేకాకుండా ఈ పాట వింటే గతంలో దేవి సంగీతం అందించిన వేరే సినిమాలోని పాటల వలే అనిపిస్తుంది. కానీ మాస్ బీట్ పరంగా పర్వాలేదనిపించింది. మొత్తానికి ఈ మాస్ సాంగ్ అంతగా బాగాలేదని చెప్పుకోవచ్చు. ఈ ఆల్బంలో ఈ పాటే మైనస్ అయ్యిందని చెప్పుకోవచ్చు.


ఇవి కేవలం ఆడియో వినడానికి మాత్రమే ఇలా వున్నాయి. కానీ విజువల్స్ పరంగా ఇంకెలా వుండనున్నాయో మరికొద్ది రోజుల్లో తెలియనుంది. మరికొద్ది గంటల్లో థియేటర్ ట్రైలర్ కూడా విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Srimanthudu  Audio Songs  Shruti haasan  Posters  

Other Articles