Allu Arjun Dedicates Filmfare Best Actor Award to ANR; Nagarjuna Thanks him for His Gesture

Allu arjun dedicates best actor for race gurram award to anr

allu arjun, Akkineni Nageswara Rao, nagarjuna, 62th Filmfare Awards South, Allu Arjun dedicated Filmfare Award to ANR, Filmfare Award Best Actor, Nagarjuna late father ANR, Nagarjuna thanks Allu Arjun, race gurram, manam

Stylish Star Allu Arjun's "Racegurram" was one of the biggest hits of 2014. Allu Arjun received film fare for best actor for his acting in Racegurram.

వావ్..! గ్రేట్ ! బన్ని నీ కళా హృదయానికి వందనం..

Posted: 06/28/2015 02:03 PM IST
Allu arjun dedicates best actor for race gurram award to anr

గంగోత్రి నుంచి కెరీర్ స్టార్ట్ చేసి.. అనతి కాలంలోనే తెలుగు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పర్చుకున్న నటుడు అల్లు అర్జున్. గంగోత్రి అంత స్వచ్చమైన, పవిత్రమైనదో అంతే చక్కనిది తెలుగువారు ముద్దుగా పిలుచుకునే బన్ని హృదయం. ఇప్పటికే ఇలాంటి అనేక ఉదాహరణలు మనం బన్నీ నుంచి చూశాం. అయితే.. తాజాగా అయన అందుకున్న ఫిల్మ్ ఫేర్ అవార్డు విషయంలోనూ ఆయన అదే ఉదారతను ప్రకటించారు. తనకు దక్కిన పురస్కారాన్ని దివంగత సిపీనటుడు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావుకు అంకితమిస్తున్నాట్లు ప్రకటించారు.

ఈ విషయాన్ని బన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు. ఇదే అతని స్వచ్చమైన కళా హృదయానికి దర్పణం పడుతుంది. తెలుగు సినివినీలాకాశంలో ధృవతారలా వెలుగుతున్న అక్కినేని వంటి సీనియర్ నటులను తలుచుకుని.. ఆయనకు తన అవార్డును అంకితం చేయడం నిజంగా గ్రేట్ జాబ్. అంతేకాదండీ తననెంతగానో సపోర్ట్ చేసినందుకు రేసుగుర్రం లోని నటీనటులకు యూనిట్ మొత్తానికి, మరీ ముఖ్యంగా చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డికి బన్ని ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun  Akkineni Nageswara Rao  nagarjuna  62th Filmfare Awards South  

Other Articles