Prabhas Baahubali film to release in japan

Prabhas baahubali film to release in japan

Baahubali film release in japan, Baahubali movie news, Baahubali movie updates, Baahubali promotions, Baahubali latest updates, Baahubali news, Baahubali movie stills, Baahubali posters, Baahubali songs, Baahubali audio, Baahubali trailer, Baahubali teaser, Baahubali

Prabhas Baahubali film to release in japan: SS Rajamouli Direction. Prabhas, Anushka, Rana, Tamannah acts in lead roles. Baahubali movie will be release on 10 july. MM Keeravani music.

జపాన్ లో గ్రాండ్ గా విడుదల కానున్న బాహుబలి

Posted: 06/26/2015 10:04 AM IST
Prabhas baahubali film to release in japan

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ పేరు ప్రస్తుతం ఇండియాలో మారుమ్రోగిపోతుంది. ఈ సినిమా కోసం ఇప్పటికే అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రలో,  రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, ప్రభాకర్, అడవి శేష్ లు ముఖ్య పాత్రలలో నటించారు. భారీ బడ్జెట్ తో ఆర్కా మీడియా సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ యూట్యూబ్ రికార్డులను బద్దలుకొట్టేసి, కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయిని దాటిపోయాయి. కీరవాణి అందించిన పాటలు బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. దాదాపు 4వేలకు పైగా థియేట్లర్లలో ‘బాహుబలి’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అలాగే జపాన్ లో కూడా ‘బాహుబలి’ చిత్రాన్ని తమిళ వర్షెన్ లో విడుదల చేయనున్నారు.

జపాన్ లో రజనీకాంత్ నటించిన తమిళ చిత్రాలు బాగానే విడుదలయ్యాయి. కాబట్టి ‘బాహుబలి’ సినిమాను కూడా జపాన్ లో విడుదల చేస్తున్నారు. రికార్డు స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మరి ఈ సినిమా విడుదలై ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  tamil audio songs  trailers  prabhas  anushka  

Other Articles