Baahubali Malayalam version audio release date

Baahubali malayalam version audio release date

Baahubali Malayalam versions songs release date, Baahubali Malayalam songs release date, Baahubali movie latest news, Baahubali posters, Baahubali movie updates, Baahubali movie details, Baahubali stills, Baahubali songs, Baahubali trailers

Baahubali Malayalam version audio release date: Prabhas latest film Baahubali. This film malayalam version songs release on 27 june. SS Rajamouli Direction. Keeravani music.

జూన్ 27న మలయాళ బాహుబలి పాటలు విడుదల

Posted: 06/18/2015 09:35 AM IST
Baahubali malayalam version audio release date

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్వకత్వంలో ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రలలో నటించిన ‘బాహుబలి’ చిత్రం విడుదల తేది దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు ఇక ఊపందుకున్నాయి. ఈ చిత్రాన్ని జులై 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషలలో విడుదల చేయబోతున్నారు.

అయితే ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ లను విడుదల చేసారు. ఈ ట్రైలర్లు ఇప్పటికే అన్ని భాషలలో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. అయితే ఇటీవలే ఈ చిత్ర తెలుగు ఆడియో విడుదల కార్యక్రమం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇపుడు మలయాళ వర్షెన్ సాంగ్స్ ను కూడా చెన్నైలో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మలయాళ వర్షెన్ ఆడియో విడుదల కార్యక్రమాన్ని జూన్ 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఆడియో వేడుక కేరళలోని కొచ్చిలో జరుగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు మలయాళ స్టార్ హీరోలు, దర్శకులు పాల్గొననున్నారు. మరి అక్కడ ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

ఆర్కా మీడియా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇప్పటికే విడుదలైన తెలుగు పాటలు టాప్ 1 స్థానంలో నిలుస్తున్నాయి. కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  Malayalam audio  Release Date  Trailer  

Other Articles