Baahubali hindi version premiere show date

Baahubali hindi version premiere show date

Baahubali hindi premiere show date, Baahubali hindi premiere show, Baahubali premiere show, Baahubali movie latest news, Baahubali posters, Baahubali movie updates, Baahubali movie details, Baahubali stills, Baahubali songs, Baahubali trailers, Prabhas, Karan Johar, Bollywood News

Baahubali hindi version premiere show date: Prabhas baahubali movie will be release on 10 july. karan johar release baahubali hindi version. mm keeravani music. Prabhas, rana, anushka, tamanna acts in lead roles.

బాహుబలి కోసం రాబోతున్న అమితాబ్, షారుక్

Posted: 06/18/2015 10:03 AM IST
Baahubali hindi version premiere show date

‘బాహుబలి’ చిత్రాన్ని తెలుగుతో పాటుగా తమిళ, హిందీ, మలయాళ భాషలలో కూడా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.

ఈ చిత్ర హిందీ వర్షెన్ ను బాలీవుడ్ ప్రముఖ దర్శక,నిర్మాత కరణ్ జోహర్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ వెర్షన్ ల థియేటర్ ట్రైలర్లు విడుదలై భారీ రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా జులై 10న విడుదల చేయబోతున్నట్లుగా ఇటీవలే జరిగిన తెలుగు ఆడియో విడుదల కార్యక్రమంలో ప్రభాస్ అధికారికంగా ప్రకటించేసాడు.

బాహుబలి హిందీ వర్షెన్ కు స్పెషల్ ప్రీమియర్ షో ను ప్లాన్ చేసారు కరణ్ జోహర్. ఈ ప్రీమియర్ షో ను జులై 9న ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రీమియర్ షో కు అమితాబ్, షారుక్ ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు, సినీ ప్రముఖులు ఈ షోకు హాజరు కానున్నారు. ఈ సినిమా విజయంపై కరణ్ జోహర్ చాలా నమ్మకంతో వున్నాడు.

ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. మరికొద్ది రోజుల్లో భారీగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు కనివినీ ఎరుగని రీతిలో జరపడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే కీరవాణి సంగీతం అందించిన పాటలు విడుదలై దుమ్ముధులుపుతున్నాయి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ కీలక పాత్రలలో నటించారు. భారీ అంచనాలతో విడుదల కానున్న ఈ సినిమా ఎన్ని రికార్డులను బద్దలుకొట్టనుందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  premiere show date  Prabhas  Karan Johar  Bollywood News  

Other Articles