Tapsee | Wedding planner | Events | Movie news

Tapsee enters into wedding planner business

Tapsee Started Wedding Planner Business, Tapsee Wedding Planner Business, Tapsee wedding planning, Tapsee Wedding factory, Tapsee latest business, Tapsee latest news, Tapsee movie news, Tapsee event news, Tapsee stills, Tapsee

Tapsee Enters into Wedding Planner Business: Actress Tapsee enters into business field. Tapsee started wedding planner and events management.

వెడ్డింగ్ ప్లానర్ అవతారంలో సొట్టబుగ్గల సుందరి తాప్సీ

Posted: 05/16/2015 12:18 PM IST
Tapsee enters into wedding planner business

‘మీ ఇంట్లో ఏదైన శుభకార్యం, ఫంక్షన్లు, పెళ్లిళ్లు వంటి ఏమైనా కార్యక్రమాలు వున్నాయా? వాటిని మీరు చాలా అందంగా, ఘనంగా, సందడిగా చేయాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి’ అంటూ పలు ఈవెంట్ కంపెనీలు పలు ప్రకటనలు చేస్తుంటారు... మీకు తెలిసే కదా! అలాంటి వారిలోకి తాప్సీ కూడా చేరిపోయింది. కాకపోతే చాలా ప్రొఫెషనల్ గా మాత్రమే.

మొన్నటి వరకు తెలుగులో వరుసగా స్టార్ హీరోల సరసన నటించిన సొట్టబుగ్గల సుందరి తాప్సీ... బాలీవుడ్ లో ఆఫర్లు రాగానే అక్కడికే మకాం మార్చేసింది. ప్రస్తుతం తమిళ, హిందీ భాషల సినిమాలతో తాప్సీ బిజీగా వుంది. సినిమాలతో బిజీగా వున్న ఈ అమ్మడు తాజాగా ఓ బిజినెస్ ను స్టార్ట్ చేసింది.

తాప్సీ తన చెల్లెలు షాగున్, ఫ్రెండ్ ఫరాహ్ పర్వరేష్ లతో కలిసి ఓ వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీని ప్రారంభించింది. తాజాగా ‘వెడ్డింగ్ ఫ్యాక్టరీ’తో ఈ కంపెనీను ప్రారంభించారు. ఈ విషయం గురించి తాప్సీ మాట్లాడుతూ... చెల్లెలు షాగున్, ఫ్రెండ్ ఫరాహ్ పర్వరేష్ లతో కలిసి ‘వెడ్డింగ్ ఫ్యాక్టరీ’ పేరుతో ఓ వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ ప్రారంభించామని, ఈ బిజినెస్ విషయంలో తాను కూడా అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాని తెలిపింది. అంతే కాకుండా ఈ కంపెనీకు సంబంధించిన ఓ వెబ్ సైట్ ను కూడా ప్రారంభించారు. ఇప్పటికే తమకు చాలా ఈవెంట్ లు చేయడానికి ఆఫర్లు వస్తున్నాయని తెలిపింది.

మరి ఇప్పటి వరకు సినిమాల్లో తన నటన, గ్లామర్ పాత్రలలో మెప్పించిన ఈ అమ్మడు బిజినెస్ పరంగా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. వెడ్డింగ్ ప్లానర్ గా మారిన ఈ అమ్మడు తన పెళ్లి విశేషాలు ఎప్పుడూ తెలియజేస్తుందో ఏమో మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tapsee  Wedding planner  Events  Movie news  

Other Articles