Vanitha Vijayakumar | files complaint | MGR Sivaji Rajini Kamal

Vanitha vijayakumar files complaint against film distributor

anitha Vijayakumar files complaint, Vanitha Vijayakumar latest news, Vanitha Vijayakumar complaint, Vanitha Vijayakumar case, Vanitha Vijayakumar news, Vanitha Vijayakumar latest updates, Vanitha Vijayakumar hot stills, Vanitha Vijayakumar love, Vanitha Vijayakumar

Vanitha Vijayakumar files complaint against film distributor: Tamil actor Vanitha Vijayakumar lodged a cheating complaint against a film distributor at the Chennai city police commissioners.

మోసం చేసిన వ్యక్తిపై కేసు పెట్టిన వనిత

Posted: 05/13/2015 02:04 PM IST
Vanitha vijayakumar files complaint against film distributor

ప్రముఖ తమిళ, తెలుగు సీనియర్ సినీ నటుడు విజయ్ కుమార్ కూతురు, సినీ నటి, నిర్మాత వనిత తమిళ సినీ పంపిణీదారుడిపై మంగళవారం పోలీస్ కమీషనర్ కు ఫిర్యాదు చేసారు. ఇటీవలే ‘వనిత ఫిలిం ప్రొడక్షన్స్’ అనే పేరుతో ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటుచేసి, ఇందులో ‘MGR Sivaji Rajini Kamal’ అనే చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రానికి తన ప్రియుడు, ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ రాబర్ట్ దర్శకత్వం వహించాడు. అయితే ఈ చిత్రం పంపిణీ ఒప్పందం విషయంలో తనకు అన్యాయం చేసారని వెబ్రన్ మూవీస్ వెంకటేష్ రాజాపై వనిత ఫిర్యాదు చేసారు. ఈ విషయంపై వనిత ఆగ్రహం వ్యక్తం చేసారు.

తనకు జరిగిన అన్యాయం గురించి వనిత మాట్లాడుతూ... తాను ‘వనిత ఫిలిం ప్రొడక్షన్స్’ అనే పేరుతో ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటుచేసి, అందులో ‘MGR Sivaji Rajini Kamal’ అనే చిత్రాన్ని నిర్మించానని తెలిపారు. అయితే ఈ చిత్ర పంపిణీ హక్కులను వెబ్రన్ మూవీస్ వెంకటేష్ రాజాకు 80 థియేటర్లలో విడుదల చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నానని, అలాగే ప్రమోషన్ కార్యక్రమాల కోసం 30 లక్షలు, మరియు డిజిటలైజ్ విధానంలో విడుదల చేయడానికి 8 లక్షలను తన నుంచి వెంకటేష్ రాజా తీసుకున్నారని వనిత తెలిపింది.

అయితే ఈ చిత్రాన్ని 80 థియేటర్లలో కాకుండా అతి తక్కువ థియేటర్లలో విడుదల చేసి, వెంకటేష్ ఒప్పందాన్ని అతిక్రమించారని, అందుకు తనకు భారీగా నష్టం ఏర్పడిందని వనిత తెలిపింది. తాను ఇచ్చిన 38 లక్షలను వెంకటేష్ రాజా తిరిగి చెల్లించాలని కోరుతూ... ఆయనపై పోలీస్ కమీషనర్ కు ఫిర్యాదు చేసినట్లుగా వనిత తెలియజేసారు. మరి ఈ విషయంపై ఎలాంటి పరిష్కారం లభించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vanitha Vijayakumar  files complaint  MGR Sivaji Rajini Kamal  

Other Articles