Nayanthara | Seenugadi love story | Audio release date

Seenugadi love story audio details

Seenugadi love story audio release soon, Seenugadi love story stills, Seenugadi love story posters, Seenugadi love story movie news, Nayanthara latest news, Nayanthara stills, Nayanthara hot news, Nayanthara hot stills, Nayanthara

Seenugadi love story audio details: Nayantara udayanidhi stalin latest tamil block buster movie dubbing into tollywood as Seenugadi love story.

త్వరలోనే శీనుగాడి లవ్ స్టోరీ పాటల సందడి

Posted: 05/13/2015 01:18 PM IST
Seenugadi love story audio details

‘ఓకె ఓకె’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన యువ కథానాయకుడు ఉదయనిధి స్టాలిన్‌`నయనతార జంటగా నటించిన తమిళ చిత్రం ‘ఇదు కదిర్‌వేలన్‌ కాదల్‌’. తమిళంలో ఘన విజయం సొంతం చేసుకొన్న ఈ చిత్రాన్ని ‘శీనుగాడి లవ్‌స్టోరి’ పేరుతో.. రెడ్‌ జైంట్‌ ఉదయనిధి స్టాలిన్‌ సమర్పణలో భీమవరం టాకీస్‌ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న సంగతి తెలిసిందే. సంతానం, శరణ్య, ఛాయాసింగ్‌, డా॥భరత్‌రెడ్డి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి హేరిస్‌ జైరాజ్‌ సంగీతం అందించారు. ఎస్‌.ఆర్‌.ప్రభాకరన్‌ దర్శకుడు. ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆడియోను అతి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రం గురించి తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ... ‘రెడ్‌ జైంట్‌ ఉదయనిధి స్టాలిన్‌ సమర్పణలో ‘శీనుగాడి లవ్‌స్టోరి’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ప్రేమకథా చిత్రాలను ఆదరించే వారందర్నీ అమితంగా ఆకట్టుకొనే ఈ చిత్రం నయనతార ఫ్యాన్స్‌కు పండగలా ఉంటుంది. హేరిస్‌ జైరాజ్‌ అందించిన బాణీలు తమిళంలో చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. తెలుగులోనూ కచ్చితంగా సూపర్‌హిట్‌ అవుతాయనే నమ్మకం ఉంది. పలు అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంతానంతో కలిసి ఉదయనిధి స్టాలిన్‌ చేసే కామెడీ ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈవారంలో ఆడియో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.

ఉదయనిధి స్టాలిన్‌, నయనతార, శరణ్య, ఛాయాసింగ్‌, డా॥భరత్‌రెడ్డి ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జైరాజ్‌, ఛాయాగ్రహణం: బాలసుబ్రమణియం, సమర్పణ: రెడ్‌ జైంట్‌ ఉదయనిధి స్టాలిన్‌, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: ఎస్‌.ఆర్‌.ప్రభాకరన్‌!!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nayanthara  Seenugadi love story  Audio release date  

Other Articles