Uma Krisnan | Trishas Breakup

Uma krisnan confirms trishas breakup

Trisha Breakup confirmed, Trisha Breakup news, Trisha Breakup details, Trisha Breakup updates, Trisha latest news, Trisha movie news, Trisha hot news, Trisha latest updates, Trisha mother, uma krishnan

Uma Krisnan Confirms Trishas Breakup: Trisha, Varun manian breakup news confirmed by her mother uma krishnan.

త్రిష బ్రేకప్ అయ్యింది అంతే.. ఇంకేం అడగకండి!

Posted: 05/07/2015 03:03 PM IST
Uma krisnan confirms trishas breakup

ఇటీవలే హీరోయిన్ త్రిష నిశ్చితార్థం వరుణ్ మాణియన్ అనే వ్యాపారవేత్తతో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ విడిపోయారని, ప్రస్తుతం ఒకరికొకరు మాట్లాడుకోవట్లేదని, వీరి పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని గతకొద్ది రోజులుగా టాలీవుడ్, కోలీవుడ్ లో వార్తలొస్తున్న విషయం తెలిసిందే.

త్రిష తన నిశ్చితార్థం ఉంగారాన్ని కూడా తీసేసిందని, వరుణ్ తో గొడవలు వచ్చి ఇద్దరూ విడిపోయారని, అందుకే వరుస ఆఫర్లను త్రిష అంగీకరిస్తుందంటూ వార్తలొస్తున్నాయి. అయితే త్రిష, వరుణ్ లు విడిపోవడం వెనుక చాలా కారణాలున్నాయని రకరకాలుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా వరుణ్ ప్రవర్తన త్రిషకు అస్సలు నచ్చలేదని పుకార్లు వినిపిస్తున్నాయి.

త్రిష, వరుణ్ ల నిశ్చితార్థం తర్వాత తన స్నేహితులకు త్రిష పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పార్టీకి హీరో ధనుష్ ను కూడా ఆహ్వానించింది. అయితే వరుణ్ కు ధనుష్ రావడం ఇష్టం లేదట. కానీ ధనుష్ ను త్రిష ఆహ్వానించింది. పార్టీ అనంతరం త్రిషకు వరుణ్ భారీగా కండిషన్లు పెట్టే ప్రయత్నం చేసాడట. దీంతో ఇప్పుడే ఇన్ని కండిషన్లు పెడితే.. ఇక పెళ్లి తర్వాత ఎలా వుండబోతుందోననే ఉద్దేశ్యంతో వరుణ్ కు త్రిష బ్రేకప్ చెప్పినట్లుగా తెలిసింది.

అయితే త్రిష, వరుణ్ లు బ్రేకప్ అయినట్లుగా గతకొద్ది నెలలుగా వార్తలొస్తూనే వున్నాయి. కానీ ఈ విషయంపై వీరిద్దరూ స్పందించలేదు. కానీ తాజాగా త్రిష తల్లి ఉమా కృష్ణన్ స్పందించారు. త్రిష, వరుణ్ లు బ్రేకప్ అయ్యారని తెలిపారు కానీ బ్రేకప్ కు గల కారణాలను ఉమా కృష్ణన్ తెలియజేయలేదు. ఎవరిని బాధించడం ఇష్టం లేకనే కారణాలు చెప్పట్లేదని, ప్రస్తుతం త్రిష తన సినిమాలపైనే దృష్టి పెట్టిందని ఉమాకృష్ణన్ చెప్పుకొచ్చారు.

మొత్తానికి త్రిష, వరుణ్ ల బ్రేకప్ వార్తలపై ఓ క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం త్రిష హీరోయిన్ గా నటించిన ‘లయన్’ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. ప్రస్తుతం త్రిష చేతిలో అరడజనుకు పైగా చిత్రాలున్నాయి. ఇంకా ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు వస్తూనే వున్నాయి. మరి భవిష్యత్తులో ఈ అమ్మడు ఎవరిని పెళ్లి చేసుకోనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trisha  Uma krishnan  Breakup confirmed  

Other Articles