Anushka | Devasena | First Look poster | Bahubali

Anushka devasena first look poster released

Anushka Devasena First Look ReleasedAnushka as Devasena, Anushka latest stills, Anushka posters, Baahubali new posters, Baahubali new look, Baahubali movie news, Baahubali movie updates, Baahubali movie news, Baahubali movie stills, Baahubali movie latest stills, Baahubali movie latest updates, Baahubali, Prabhas, anushka

Anushka Devasena First Look Poster Released: Anushka latest Upcoming movie Bahubali. anushka as devasena in baahubali. Director SS Rajamouli.

అయ్యో.. దేవసేనగా అనుష్క ఇలా అయ్యిందేంటి?

Posted: 05/06/2015 04:29 PM IST
Anushka devasena first look poster released

'తెలుగు, తమిళ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ అనుష్క అందం, అభినయం, బాడీ ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. వయసు పెరుగుతున్నా కూడా ఈ అమ్మడి అందంలో ఎలాంటి మార్పు లేకుండా... ఇంకా గ్లామర్ గా కనిపిస్తూ వుంది. అలాంటి అనుష్కను మరీ ఇంత దారుణంగా చూపిస్తారని ఎవరూ ఊహించరు కావచ్చు. అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం ‘బాహుబలి’.

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా అనుష్క హీరోయిన్ గా నటిస్తుంది. మే 1వ తేది నుంచి ‘బాహుబలి’ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు పోస్టర్లు విడుదలయ్యాయి. శివుడు పాత్రలో వున్న ప్రభాస్ పోస్టర్ కు భారీ క్రేజ్ వచ్చింది. అయితే తాజాగా కొద్ది క్షణాల క్రితం ‘బాహుబలి’ చిత్రంలోని దేవసేన పాత్రకు సంబంధించిన అనుష్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.

ఇందులో అనుష్కను చూస్తుంటే మరీ దారుణంగా వుంది. ఏదో సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేలా వుంది. రాజ్యం నుంచి దేవసేనను బహిష్కరించే సమయంలో చిత్రీకరించినట్లుగా అనిపిస్తోంది. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలో కనిపించిన అనుష్కను.. ఒక్కసారిగా ఇలాంటి లుక్ లో చూసే సరికి అభిమానులు కాస్త షాక్ అవుతున్నారు. కానీ అనుష్క ఎప్పుడూ కూడా నటిగా తనను తాను నిరూపించుకునే పాత్రలు చేస్తోందని ప్రశంశిస్తున్నారు.

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా బ్యానర్లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మే 31వ తేదిన ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. జులై 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Anushka Devasena First Look Released-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Anushka  Devasena  First Look poster  Bahubali  

Other Articles