Lion | Balakrishna | Cutouts | movie news

Balakrishna lion movie audio launch cutouts

Lion Audio launch cutouts, Balakrishna Lion Audio launch cutouts, Balakrishna Lion cutouts, Lion Audio launch stills, Lion Audio launch events, Lion Audio launch details, Lion movie news, Lion movie updates, Lion news, Lion movies

Balakrishna Lion movie Audio launch cutouts: Nandamuri Balakrishna latest movie Lion. This movie audio launch on 9 april. manisharma music.

కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన నందమూరి లయన్

Posted: 04/09/2015 04:29 PM IST
Balakrishna lion movie audio launch cutouts

నందమూరి బాలకృష్ణ ‘లయన్’ సందడి మొదలయ్యింది. ఓ ఏరియా మొత్తం ‘లయన్’ కటౌట్లతో నిండిపోయాయి. అసలు మాములు హీరోలు, స్టార్ హీరోల సినిమాల ఆడియో విడుదల కార్యక్రమాలకు కటౌట్లు ఏర్పాట్లు చేస్తారనే విషయం తెలిసిందే. కానీ బాలయ్య అంటే కాస్త ప్రత్యేకత వుండాలని అనుకున్నారో ఏమో... అంతే ఓ భారీ కటౌట్ ను దించేసారు చిత్ర యూనిట్.

బాలకృష్ణ నటిస్తున్న ‘లయన్’ ఆడియో విడుదల కార్యక్రమం నేడు శిల్పకళా వేదికలో సాయంత్రం ఘనంగా జరుగనుంది. దీంతో శిల్పకళావేదిక వద్ద బాలకృష్ణ ‘లయన్’ సినిమాకు సంబంధించిన భారీ కటౌట్లు ఏర్పాట్లు చేసారు. బాలయ్యకు సంబంధించిన ఓ 45 అడుగుల కటౌట్ ను ఏర్పాటు చేసారు.

ఇంత పెద్ద కటౌట్ ఇప్పటి వరకు ఏ హీరోకు కూడా ఏర్పాటు చేయలేదు. ఈ క్రెడిట్ మాత్రం బాలయ్యకే దక్కిందనే చెప్పుకోవచ్చు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా విడుదల కానుంది.

ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సత్యదేవ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బాలయ్య సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Balakrishna Lion Audio launch cutouts-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Lion  Balakrishna  Cutouts  movie news  

Other Articles