Jayasudha panel | rajendra panel | Maa Elections

Questions araise on jayasudha contesting in maa elections

maa elections, jayasudha pannel, rajendra prasad pannel, movie artist association, maa president elections, rajendra prasad news, jayasudha press meet, artist hema news, nagababu, nagababu rajendra prasad, nagababu press meet, jayasudha updates, actor uttej, actor shivaji raja

Questions araise on actress jayasudha contesting in MAA Elections against comedian Rajendraprasad

రాజకీయ మేళవింపుతో ‘మా’ లో మహత్తర పోరు

Posted: 03/25/2015 04:05 PM IST
Questions araise on jayasudha contesting in maa elections

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకున్న సహజ నటి జయసుధ.. రాజకీయాన్ని బాగానే వంట పట్టించుకుంది. ఇటు అభినయం.. అటు రాజకీయం రెండింటినీ మేళవించి తాజా మా ఎన్నికలలో తన గెలుపు కోసం శ్రమిస్తున్నారు. తన పని తాను చేసుకుంటూనే.. ప్రత్యర్థుల పనులను చెడగొట్టమే ఇక్కడ జరుగుతున్న రాజకీయం. ఓ వైపు తన ప్రచారం జోరుగా కొనసాగిస్తూనే.. ప్రత్యర్థి నటకిరీటి రాజేంద్రప్రసాద్, అయనకు మద్దతునిస్తున్న వారికి మాత్రం అమె తన మద్దతుదారులతో విమర్శలు, పరోక్ష ఆరోపణలు చేయిస్తున్నారు.

సినీ కళామతల్లి ముదుబిడ్డలం అని చెప్పుకునే ఆర్టిస్టుల అకలి బాధలు తెలియని వారు, వారి బాగోగులు చూడటానికి క్షణం తీరిక దోరకని మద్దతుదారులతో కలసి ప్రచారం జోరుగా కొనసాగిస్తూనే.. ప్రత్యర్ధులపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టడం.. బహుశా మూవీ అర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలలో ఇది తొలిసారి కావచ్చు. రాజకీయ నేతగా ఎదిగిన వారు.. ఆ గద్దెలను వదిలి.. మళ్లీ ఈ ఫీఠాలను అధిరోహించి.. ఏమి సాధించాలని అనుకుంటున్నారో మాత్రం స్పష్టం చేయాల్సిన అవసరం వుందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. ఈ విషయాలను పక్కనబెడితే.. గెలుపే పరమావదిగా బరిలోకి దిగిన జయసుధ మాత్రం మరో కొత్త కోణంలో ప్రచారం చేసుకునేందుకు ముందుకు దూసుకెళ్తున్నారు.

తనను పోటీ నుంచి తప్పుకోమని రాజకీయ నాయకుల నుంచి చాలా ఫోన్‌కాల్స్ వచ్చాయని.. అసలు ఓ మహిళ ఎందుకు పోటీ చేయకూడదనే ఆలోచనతోనే తాను బరిలోకి దిగానని చెబుతుందీ మహిళా మణి. యావతాంధ్ర రాష్ట్ర ప్రేక్షకులను కడుపుబ్బనవ్వించిన హస్యనటుడు రాజేంద్రప్రసాద్ ఎన్నికల బరిలో నిలుస్తున్నానని ముందుగా ప్రకటించిన తరువాత కూడా.. తాను బరిలోకి దిగుతున్నానని ప్రకటించటండం వెనుక మర్మమేమిటో.. వెనకనుండి కథను నడిపిస్తున్న కథానాయకుల మతలబు ఏమిటో వారికే తెలియాలంటూ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు చెవులు కోరుకుంటున్నారు.

జయసుధకు మద్దతునిస్తున్న మురళీమోహన్ అమె చాలా సినియర్ నటి అంటూ వెనకేసుకోస్తున్నారు. ఆమె చాలా సేవా దృక్పథం కలిగిన వ్యక్తి. ఎమ్మెల్యేగా కూడా పనిచేశారని చెబుతున్నారు. రాజకీయాలతో మా ఎన్నికలను కూడా రణరంగం క్షేత్రంగా మార్చనున్నారా..? అన్న ప్రశ్నకు బుదులు కూడా ఇవ్వాలి. ఇదివరకు ఓ సారి పోటీ చేసి ఓటమిని చవిచూసిన రాజేంద్రప్రసాద్ కు పదవిని కట్టబెడితే.. సముచితమే కదా.. రాజకీయాలలో భవిష్యతును జారవిడుగుకున్న జయసుధ ఇక ఇప్పుడు సిని ఆర్టిస్టుల భవిష్యత్ ఎలా ఉజ్వలింపజేస్తుంది..? అసలు రాజకీయాలకే సంబందం లేని నట కిరీటికి.. ఇప్పటి వరకు ఏ పదవీ చేపట్టని రాజేంద్రుడికి మా కీరీటాన్ని అందకుండా అడ్డుకునేందుకు కారణమేంటి అన్నది కూడా శేష ప్రశ్నగానే మిగులుతుందని సినీ వర్గాలు పుకార్లు.

రాజకీయ రంగు పులుపుకున్న మా ఎన్నికలలో ఎలాగైనా గెలవాలన్న తలంపుతో.. రాజేంద్రుడికి మద్దతు పలికిన మోగా బ్రదర్ నాగబాబుపై తన మద్దతుదారు నటి హేమతో పరోక్ష ఆరోపణలు కూడా సందించింది. ఇది వరకు మా ఎన్నికలు అంటే అవేంటని సాధరణ ప్రజలు అనుకునే స్థాయి నుంచి విమర్శలు, అరోఫణల స్థాయికి ఎన్నికలు చేరాయి. మరి కొన్నాళ్లయితే.. ఇక బజారునపడి వీధి పోట్లాటకు కూడా సై అంటారేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఒకరి తరువాత ఒకరం.. అందరం సినికళామ తల్లి ముద్దుబిడ్డలం అనుకుని ఐక్యంగా ముందుకెళ్తేనే మా కు గౌరవం దక్కుతుంది. ఆర్టిస్టులకూ అదే గౌరవం నిలబడుతుంది..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : rajendra prasad pannel  jayasudha pannel  maa president elections  

Other Articles