Allu arjun boyapati srinu movie launch details

Allu arjun boyapati srinu movie launch details, Allu arjun boyapati srinu movie launch on march, Allu arjun boyapati srinu movie news, Allu arjun boyapati srinu movie details, Allu arjun boyapati srinu movie pressmeet, Allu arjun movie news, Allu arjun movie stills, Allu arjun songs, Allu arjun

Allu arjun boyapati srinu movie launch details: Allu arjun next movie with director boyapati srinu in geeta arts banner. allu aravind producing, thaman music director.

ఏప్రిల్ లో సింహ, రేసుగుర్రం కాంబినేషన్ సినిమా

Posted: 02/21/2015 03:34 PM IST
Allu arjun boyapati srinu movie launch details

కమర్షియల్ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాత అల్లు అరవింద్ నిర్మించనున్నారు. థమన్ సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రం మార్చిలో పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకొని, ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించబోతున్నారు.

దర్శకుడు బోయ‌పాటి శ్రీను మాట్లాడుతూ.. బ‌న్నితో సినిమా ఎప్పుడో చేయాల్సింది. బ‌న్ని బాడీ లాంగ్వేజ్ కి స‌రిపోయో క‌రెక్ట్ క‌థ సిధ్ధం చేశాను. అర‌వింద్ గారు, బ‌న్ని ఈ క‌థ విని వెంట‌నే ఓకే చేశారు. ప‌క్కా అవుట్ అండ్ అవుట్ హీరోయిజం వున్న స్టోరి, హీరోయిజం వుంటూనే ల‌వ్ స్టోరి వుంటుంది. ఈ చిత్రంలో కొత్త బ‌న్ని క‌న‌ప‌డ‌తాడనేది ఖ‌చ్చితంగా చెప్పగ‌ల‌ను. బ‌న్నితో చేయ‌టం అది కూడా అల్లు అర‌వింద్ గారు నిర్మాత గా గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో చిత్రం తెరకెక్కటం చాలా సంతోషంగా వుంది. ఈ చిత్రం త‌రువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో మ‌రో చిత్రం చేయ‌నున్నాను. అది ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన వెంట‌నే వుంటుంది అని అన్నారు.

ఈ సంద‌ర్భంగా అల్లు అర‌వింద్ మాట్లాడుతూ... అల్లు అర్జున్‌, బోయ‌పాటి శ్రీను కాంబినేషన్ లో చిత్రం చేయాల‌ని చాలా రోజుల నుండి అనుకుంటున్నాం. బోయ‌పాటి శ్రీను చెప్పిన క‌థ నాకు, బ‌న్ని కి బాగా న‌చ్చి మా బ్యాన‌ర్ గీతాఆర్ట్స్ లో చేస్తున్నాం. అవుట్ అండ్ అవుట్ హీరోయిజం వుంటూ ప్యూర్ ల‌వ్ స్టోరి మిక్స్ అయిన క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ గా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాం. బ‌న్నిని అభిమానులు, సినిమా ప్రేక్షకులు ఎలా చూడాల‌ని అనుకుంటున్నారో ప‌క్కాగా అలాంటి క్యారెక్టరైజేషన్ తో బోయ‌పాటి శ్రీను క‌థ చెప్పటంతో అంద‌రికి న‌చ్చింది.

రేసుగుర్రం చిత్రం త‌రువాత బ‌న్ని ఎన‌ర్జిని దృష్టిలో పెట్టుకుని త‌న స్టైల్ ని కొత్తగా క్రియోట్ చేశారు బోయ‌పాటి. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ న‌టిస్తున్నారు. ఆ వివ‌రాలు త్వరలోనే చెబుతాం. రేసుగుర్రం చిత్రం త‌రువాత బ‌న్ని కాంబినేష‌న్ లో థ‌మ‌న్ చేస్తున్న రెండ‌వ చిత్రం ఇది. ఈ చిత్రాన్ని మార్చిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించి ఏప్రిల్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ చేస్తున్నాము. ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్షకులని అల‌రించే విధంగా వుంటుంది. హీరోయిన్స్ తో పాటు మిగ‌తా న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ వివ‌రాలు త్వరలోనే తెలియ‌జేస్తాం అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu arjun  Boyapati srinu  movie  launch  geeta arts  allu aravind  thaman  telugu  news  

Other Articles