Shruti hassan story skills kamal hassan script writing software tollywood kollywood

shruti hassan news, kamal hassan news, tollywood news, telugu movie stories, tamil movie stories, shruti hassan latest news, shruti hassan interview, shruti hassan press meet, shruti hassan facebook, shruti hassan twitter, shruti hassan kamal hassan, shruti with father, kamal with daughters, shruti hassan movie stories

shruti hassan story skills kamal hassan script writing software tollywood kollywood : Kamal hassan inspired shruti hassan to write stories and present script writing software. So thats why she already started to write stories for short stories.

తండ్రే అనుకుంటే.. తనయ కూడా మించిపోతోంది!

Posted: 02/05/2015 11:07 AM IST
Shruti hassan story skills kamal hassan script writing software tollywood kollywood

విలక్షణ నటుడు కమల్ హాసన్’లో వున్న టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు! ఇప్పటికే నటుడిగా ఆయన లోకనాయకుడు అనే పేరు సంపాదించుకున్నారు. ఇక దర్శకుడిగా, రచయితగా, గాయకుడిగా కూడా ఈయన తన ప్రతిభను నిరూపించుకున్నారు. చిత్రపరిశ్రమలో వున్న అన్నిరంగాల్లోనూ పాలుపంచుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. ఈ విధంగానే తనలోనూ టాలెంట్ ఇమిడివుందని ఆయన తనయ శృతిహాసన్ కూడా నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.

నటిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్.. మంచి గాయని కూడా! ఇదివరకే ఈమె రెండుమూడు పాటలు కూడా పాడి తన సింగింగ్ టాలెంట్ నిరూపించుకుంది. ఇప్పుడు తాజాగా ఈ అమ్మడు రచయితగా అవతారమెత్తనుంది. పైగా ఆమెను సినిమాలకు రచన చేయమంటూ తండ్రే ప్రోత్సాహిస్తున్నాడు కూడా! ఇందులో భాగంగానే కమల్ ఇటీవలే పుట్టినరోజు జరుపుకున్న తన కూతురు శృతికి ‘స్ర్కిప్ట్ రైటింగ్ సాఫ్ట్ వేర్’ను ప్రజెంట్ చేశాడట! అందుకే.. ఈ అమ్మడు తండ్రి బాటలోనే నడుస్తూ మూవీల కోసం పెన్ను పట్టుకోవడం ప్రారంభించింది. ఇప్పటికే ఆమె తన మైండ్’లో ఫిక్స్ చేసుకున్న కొన్ని స్టోరీలను పెన్నుతో రాయడం మొదలుపెట్టిందని సమాచారం!

ఈ విషయమై శృతి చెబుతూ.. ‘‘నేను టాలెంటెడ్ రచయితనని నాన్నకు నమ్మకం ఎక్కువ. అందుకే.. ఆ విధంగా నన్ను ప్రోత్సహిస్తూ ‘స్ర్కిప్ట్ రైటింగ్ సాఫ్ట్ వేర్’ను ప్రెజెంట్ చేశారు’’ అంటోంది ముద్దుగుమ్మ. అంతేకాదు.. ఈ అమ్మడు తన 15వ ఏట నుంచే కథలు రాయడం ప్రారంభించిందని, పాటలు కూడా రాయగలనని చెబుతోంది. త్వరలోనే షార్ట్ ఫిల్మ్స్’కి రచన చేస్తానని చెబుతోంది. అంటే.. ఈ అమ్మడు ఇక నుంచి నటిగా కొనసాగుతూ రచయితగా వ్యవహరించనుందన్నమాట! చూస్తుంటే.. తన తండ్రిలాగే ఈమె కూడా విలక్షణ నటిగా పేరుపొందే అవకాశాలున్నాయని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఎంతైనా కమల్ కూతురు కదా! ఆ మాత్రం టాలెంట్ వుండాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shruti hassan latest updates  kamal hassan latest news  tollywood news  

Other Articles