Pataas movie tv satellite rights zee telugu channel high remuneration

pataas movie news, pataas movie tv rights, pataas tv rights, pataas tv satellite rights, pataas movie news, kalyan ram pataas movie, kalyan ram pataas news, pataas satellite rights, zee telugu channel, pataas movie collections

pataas movie tv satellite rights zee telugu channel high remuneration : kalyan ram pataas movie tv satellite rights has sold for hugh amount.

బుల్లితెరపై బాంబుల పేలిన ‘పటాస్’!

Posted: 02/03/2015 04:45 PM IST
Pataas movie tv satellite rights zee telugu channel high remuneration

ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే.. నందమూరి కళ్యాణ్ రామ్’కు మంచి రోజులు తిరిగి వచ్చినట్లున్నాయి. ‘అతనొక్కడే’ చిత్రం తర్వాత ఆ స్థాయి హిట్ ఒక్కటి దక్కని ఈ హీరోకి.. చాలాకాలం తర్వాత ‘పటాస్’ రూపంలో లభించింది. ఇప్పటివరకు కళ్యాణ్ ఎదుర్కొన్న పరాజయాలన్నింటినీ ఈ ‘పటాస్’ చిత్రం పూడ్చేలా కనిపిస్తోంది. అంతటి ఘనవిజయం సాధించిన ఈ చిత్రం.. ఇప్పటికే లాభాలతో కూడిన భారీ వసూళ్లను రాబట్టింది.

ట్రేడ్ వర్గాల ప్రకారం.. 9 కోట్ల బడ్జెట్’తో నిర్మితమైన ఈ మూవీ కేవలం 10 రోజుల్లోనే 12 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఈ చిత్రం రన్ అవుతోంది. దీంతో కళ్యాణ్ కెరీర్’లోనే ఎక్కువగా వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. ఇక డిస్ట్రిబ్యూటర్లకు కూడా తమ డబ్బులు వచ్చేయడంతోపాటు లాభాలను ఆర్జిస్తున్నారు. మొత్తానికి టైటిల్’కి తగ్గట్టుగానే ఈ చిత్రం ఇండస్ట్రీలో బాగానే పేలింది. ఇప్పుడు బుల్లితెరపై కూడా బాంబుల పేలిందని సమాచారం!

థియేటర్లలో బాగా పేలిన ఈ చిత్రం.. ఇప్పుడు బుల్లితెర శాటిలైట్స్ కూడా రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోయాయని తెలుస్తోంది. బాగా టఫ్’గా జరిగిన కాంపిటీషన్’లో జీ తెలుగువారు ఈ పటాస్ మూవీ శాటిలైట్ రైట్స్’ని సుమారు రూ. 4.3 కోట్లకు సొంతం చేసుకుందని సమాచారం! థియేటర్లలో భారీగా కాసుల వర్షం కురిపించడంతోనే ఈ సినిమా ఇంత బలమొచ్చిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

నిజానికి పవన్, మహేష్ లాంటి నెంబర్ వన్ స్టార్ల చిత్రాలే టీవీ శాటిలైట్ రైట్స్ 5 నుంచి 7 కోట్ల మధ్యే అమ్ముడుపోతాయి. ఒకవేళ మూవీ ఫ్లాప్ అయితే.. మరీ దారుణంగా రైట్స్ అమ్ముడుపోతాయి. కానీ.. కళ్యాణ్ రామ్ విషయానికొస్తే ఇంతవరకు ఇతను నటించిన చిత్రాల్లో ఏ ఒక్క మూవీ రైట్స్ 2 కోట్లకుపైగా అమ్ముడుపోలేదు. అలాంటిది ఈసారి రూ.4.3 కోట్లకు అమ్ముడుపోవడంతో అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతేనేం.. కళ్యాణ్ కెరీర్’లోనే ఈ పటాస్ మూవీ భారీ విజయాన్ని అందించిందని అంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles