Mahesh babu adopt burripalem village koratala siva shruti hassan guntur mp jayadev galla

mahesh babu news, mahesh babu burri palem, village, mahesh babu movies, mahesh babu jayadev galla, guntur mp jayadev galla, shruti hassan news, koratala siva movies, mahesh babu koratala siva, mahesh babu shruti hassan, mahesh babu movie updates, shruti hassan hot photo shoot, koratala siva movie list, burri palem village, guntur burri palem village news

mahesh babu adopt burripalem village koratala siva shruti hassan guntur mp jayadev galla : guntur city mp jayadev galla has given statement that.. the superstar mahesh babu will adopt burripalem village soon.

‘బుర్రిపాలెం’ బుల్లోడు.. దుమ్ములేపనున్నాడు!

Posted: 02/03/2015 12:10 PM IST
Mahesh babu adopt burripalem village koratala siva shruti hassan guntur mp jayadev galla

ప్రజాప్రతినిధులకు ఏమాత్రం తీసిపోమంటూ సెలెబ్రిటీలు కూడా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆమధ్య ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించిన ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని ఇటు సౌత్ నుంచి అటు బాలీవుడ్ తారలంతా చేపట్టారు. అలాగే.. మోడీ ఇచ్చిన సలహాలమేరకే ఎంపీలు మారుమూల గ్రామాలను దత్తత తీసుకోవడం జరుగుతోంది. ఈమధ్యే సచిన్ కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకోగా.. నిజామాబాద్ ఎంపీ కవిత కూడా ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంది. ఇప్పుడు వీరి బాటలోనే తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా పయనిస్తున్నాడు.

గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని ‘బుర్రిపాలెం’ అనే గ్రామాన్ని మహేష్ బాబు త్వరలోనే దత్తత తీసుకోనున్నట్లు ఆయన బావ అయిన గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా తెలిపారు. జెడ్.పి.స్కూల్ అదనపు తరగతి గదుల శంకుస్థాపన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘బుర్రిపాలెం’ గ్రామాన్ని స్మార్ట్ విలేజ్’గా తీర్చుదిద్దుతామని పేర్కొన్న ఆయన.. అందుకు మహేష్ బాబు పూర్తి సహకారం అందిస్తారని తెలిపారు. త్వరలోనే ఈ విలేజ్ ‘సూపర్ విలేజ్’గా రూపుదిద్దుకోనుందని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు. గ్రామంలో కావాలసిన అన్ని వసతులను సమకూర్చడంతోపాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతామని ఆయన పేర్కొన్నారు. ఈ గ్రామాన్ని దత్తత తీసుకునే విషయంలో మహేష్ కూడా అంగీకారం తెలిపిన తర్వాతే ఇలా బహిరంగంగా వ్యక్తం చేయడం జరిగిందని ఆయన సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి.

ఇదిలావుండగా.. ప్రస్తుతం మహేష్ బాబు దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్’లో ఫుల్ బిజీగా వున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్’గా నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత అప్పుడే మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం! ఏదైతేనేం.. మహేష్ కూడా చివరికి ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని, ఇతర హీరోలకు ఆదర్శంగా నిలిచాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles