Ram gopal varma controversial tweets megastar chiranjeevi 150 movie prajarajyam party

ram gopal varma news, ram gopal varma controversial comments, ram gopal varma chiranjeevi tweets, varma chiru tweets, ram gopal varma twitter, chiranjeevi 150 movie news, prajarajyam party news, varma chiru 150 movie, ram gopal varma tweets chiru

ram gopal varma controversial tweets megastar chiranjeevi 150 movie prajarajyam party : This time ram gopal varma created a new sensation by tweeting on megastar chiranjeevi. In his tweets he explains that chiru is the best director than all others in tollywood.

ట్వీట్లతో చిరుపై బాంబు పేల్చిన వర్మ..

Posted: 01/28/2015 05:48 PM IST
Ram gopal varma controversial tweets megastar chiranjeevi 150 movie prajarajyam party

ఎప్పుడూ ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచి సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఈసారి ఏకంగా చిరుని టార్గెట్ చేసి తన ట్వీట్లతో ఆయనపై బాంబు పేల్చేశాడు. ఆయన స్థాపించిన ‘ప్రజారాజ్యం’ పార్టీకి, 150వ సినిమాకు మధ్య లింక్ పెడుతూ తనదైన రీతిలో ట్వీట్ చేశాడు. గతకొన్నాళ్ల నుంచి చిరు 150వ చిత్రం చేసేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే! నిజానికి ఈ మూవీ ఆయన బర్త్ డే సందర్భంగా ప్రారంభం కావాల్సి వుండేది కానీ.. సరైన కథ, డైరెక్టర్ దొరకని నేపథ్యంలో వాయిదా వేస్తూ వచ్చారు. ఈ వ్యవహారంపైనే వర్మ స్పందిస్తూ సంచలన ట్వీట్లు చేశాడు.

చిరు 150వ చిత్రంపై వర్మ ట్వీట్ చేస్తూ.. మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమాకు తానే దర్శకత్వం వహించుకోవాలని సూచించాడు. అలా చేయకపోతే.. ‘ప్రజారాజ్యం పార్టీ స్థాపించడం కంటే పెద్ద అది తప్పు అవుతుందన్నాడు. ఒక పర్ ఫెక్ట్ దర్శకునిలో వుండాల్సిన లక్షణాలన్నీ చిరులో చాలా మెరుగ్గా వున్నాయని, ఆ సంగతి తాను ఆయనతో కలిసినప్పుడుడే అర్థమైందని పేర్కొన్నాడు. త్రివిక్రమ్, వినాయక్ లాంటి వాళ్లతో 150వ చిత్రం చేస్తే అది ఏదో మామూలు సినిమాయే అవుతుందని ట్వీట్ చేసిన ఆయన.. అదే ఆయన దర్శకత్వం వహిస్తే బ్రహ్మాండమైన సినిమాగా రూపొంది భారీ విజయాన్ని అందుకుంటుందని ప్రశంసించాడు.

ram-gopal-varma-tweets

తన 150వ చిత్రానికి స్వయంగా దర్శకత్వం వహించుకునే తెలివితేటలు, విజ్ఞత చిరంజీవికే వున్నాయని తాను గట్టిగా నమ్ముతున్నట్లు వర్మ తెలిపాడు. ఆయనే తన చిత్రానికి దర్శకత్వం వహిస్తే.. అది మూడుదశాబ్దాల సినీ చరిత్రలో ఓ అద్భుతమైన ఘట్టం అవుతుందని, చిరుకి మరో బాహుబలి అవుతుందని ఫైనల్ టచ్ ఇచ్చాడు. గతంలో ఈవిధంగా పార్టీ పెట్టాలంటూ తన ట్వీట్ల పవన్’ను ఊరించిన ఈ సంచలన దర్శకుడు.. ఇప్పుడు చిరును తన చిత్రానికి తానే దర్శకత్వం వహించుకోవాలంటూ ప్రశంసలతో ముంచెత్తుతూ సూచిస్తున్నాడు. కొందరు మెగాభిమానులు కూడా వర్మకు మద్దతుగానే ట్వీట్లు చేస్తున్నారు.

ఇంతవరకు బాగానే వుందికానీ.. ‘‘చిరు తన చిత్రానికి దర్శకత్వం వహించకపోతే ప్రజారాజ్యం పార్టీ పెట్టడం కంటే పెద్ద తప్పవుతుంది’’ అని వర్మ కుండబద్దలు కొట్టడంపై కొందరు లొసుగులు బయటకు తీస్తున్నారు. అంటే.. చిరు ప్రజారాజ్యం పార్టీ పెట్టి చాలా పెద్ద తప్పు చేశారని వర్మ చెప్పకనే చెప్పేశాడని అంటున్నారు. ఓవైపు చిరుని మంచి దర్శకుడంటూ పొగడ్తలతో ముంచెత్తుతూనే.. మరోవైపు పార్టీ పెట్టి తప్పు చేశాడంటూ తన అభిప్రాయాలను ఈ ట్వీట్ల ద్వారా వర్మ తెలుపుతున్నాడన్నమాట! మరి.. దీనిపై చిరు, మెగా కుటుంబం ఎలా స్పందించనున్నారో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles