Sandeep kishan tiger movie teaser release i movie theatres

I movie news, I movie theatres, I movie review, i movie telugu review, ai movie telugu review, sandeep kishan tiger, telugu tiger movie, sandeep kishan tiger teaser, sandeep kishan latest movies, director shankar, chiyan vikram news, amy jackson latest news

sandeep kishan tiger movie teaser release i movie theatres : the telugu tiger movie producer tagore madhu is planning to release their movie teaser in all theatres in which I movie screening.

‘ఐ’ థియేటర్లలో ‘టైగర్’ హల్ చల్!

Posted: 01/13/2015 01:02 PM IST
Sandeep kishan tiger movie teaser release i movie theatres

సైంటిఫిక్-కమర్షియల్ చిత్రాలను ఎంతో అద్భుతంగా తెరకెక్కించడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శంకర్.. మరో వండర్’ఫుల్ ప్రాజెక్ట్ ‘ఐ’ చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే! తమిళ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్, అమీజాక్సన్ జంటగా నటించిన ఈ చిత్రం.. ఈనెల 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా వుంది. దాదాపు మూడేళ్లపాటు సుదీర్ఘంగా షూటింగ్ జరుపుకుని ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ.. విడుదలకు ముందే భారీ వసూళ్లను రాబట్టుకుంటోంది. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఇదిలావుండగా.. ఈ చిత్రం విడుదలవుతున్న థియేటర్లలో ‘టైగర్’ గర్జిస్తూ హల్ చల్ చేస్తుందని అంటున్నారు. ఇక్కడ టైగర్ అంటే రియల్ జంతువు కాదులెండి.. సందీప్ కిషన్ హీరోగా నటించిన మూవీ! ‘ఐ’ చిత్రంలోపాటు ‘టైగర్’ మూవీని కూడా థియేటర్లలో ప్రదర్శించేందుకు అన్ని ఏర్పాటు సిద్ధం చేసుకుంటున్నారు. మొత్తం మూవీ కాదు.. కేవలం టీజర్’ని మాత్రమే! ఇటీవలే ఈ మూవీకి సంబంధించి ఫస్ట్’లుక్’ని విడుదల చేసిన దర్శకనిర్మాతలు.. ‘ఐ’ విడుదలవుతున్న థియేటర్లలో టీజర్’ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట! ఇలా చేస్తే.. తమ మూవీకి మాంచి క్రేజ్ వస్తుందని, చిత్రం విడుదల సమయంలో భారీ కలెక్షన్లను రాబట్టుకోవచ్చని వాళ్లు భావిస్తున్నారు.

ఇదే విషయాన్ని ‘టైగర్’ మూవీ నిర్మాత ఠాగూర్ మధు తెలిపారు. ‘ఐ’ మూవీని ప్రదర్శించే ప్రతిఒక్క థియేటర్’లో తమ తాజా ‘టైగర్’ చిత్రానికి సంబంధించి టీజర్’ను విడుదల చేస్తున్నట్లు ఆయన అధికారికంగా వెల్లడించారు. మరి.. ఈ దెబ్బతో సందీప్’కి క్రేజ్ రావడంతోబాటు మూవీపై భారీ అంచనాలు పెరిగే అవకాశాలు కూడా వున్నాయి. మంచి సమయాన్ని చూసి చిన్నసినిమాను బాగానే మార్కెటింగ్ చేసుకుంటున్నారని సినీవిశ్లేషకులు చెప్పుకుంటున్నారు. మరి.. ఈ ప్లాన్ సందీప్ మూవీకి, అతని కెరీర్’కి ఏమేరకు ఉపయోగపడుతుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sandeep kishan tiger movie  I movie news  director shankar news  

Other Articles