Ramanaidu ill critical condition hospitalized

ramanaidu sick, d ramanaidu ill, d ramanaidu critical condition, d ramanaidu hospitalized, d ramanaidu latest updates, d ramanaidu health updates, k.balachander death latest updates, celebrities on k balachander death, tollywood on ramanaidu health, tollywood latest news updates, venkatesh movies latest updates

ramanaidu ill critical condition hospitalized : film nagar buzz that famous producer dadasaheb phalke awardee daggubati ramanaidu seriously ill and joined in nearest hospital, ramanaidu in critical condition not able to speak with others treated in nearest hospital

అగ్ర నిర్మాతకు అస్వస్థత.. ఆరోగ్యంపై భయంకర పుకార్లు

Posted: 12/24/2014 03:50 PM IST
Ramanaidu ill critical condition hospitalized

మూవీ మొఘల్ గా పేరొందిన ప్రముఖ నిర్మాత రామానాయుడు ఆరోగ్యంపై ఎవరూ వినడానికి ఇష్టపడని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫిలింనగర్ లో విన్పిస్తున్న ఈ పుకార్లు ఎంతవరకు నిజమో చెప్పలేము కానీ.., ఇదే నిజమైతే చాలా బాధాకరం. రామానాయుడు ఆరోగ్యం తీవ్ర విషమంగా ఉన్నట్లు పుకార్లు వస్తున్నాయి. తీవ్ర అస్వస్థతకు గురికావటంతో కుటుంబ సభ్యులు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.., ఇండస్ర్టీ దిగ్గజం కనీసం మాట్లాడలేకపోతున్నట్లు చెప్తున్నారు. డాక్టర్ల నిరంతర పర్యవేక్షణలో ఉంచారని ఊహాగానాలు వస్తున్నాయి. ఫ్యాన్స్ ఆందోళన చెందుతారనే ఉద్దేశ్యంతోనే కుటుంబ సభ్యులు ఈ విషయం బయటకు వెల్లడించటం లేదని తెలుస్తోంది.

1964లో వచ్చిన ‘రాముడు భీముడు’తో నిర్మాణ జీవితం ప్రారంభించిన రామానాయుడు జీవిత కాలంలో ఎన్నో ఉత్తమ చిత్రాలు నిర్మించారు. 100కు పైగా సినిమాలు నిర్మించగా చాలావరకు సూపర్ హిట్ అయ్యాయి. ఇండస్ర్టీకి చేసిన సేవలకు గాను సినీరంగంలోనే అత్యంత విశిష్ట పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును పొందారు. అంతేకాక కేంద్ర ప్రభుత్వం కూడా పద్మ బిరుదులతో గౌరవించింది. ఇక పెద్దబ్బాయి పేరుతో స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ టాలీవుడ్ లో ఇప్పటికి అగ్ర బ్యానర్ గా కొనసాగుతోంది. ఈ బ్యానర్ లో సినిమాలు చేసేందుకు  స్టార్లంతా ఆశపడేలా సినిమాలు తీసి రామానాయుడు సంస్థను నిలబెట్టారు.

కేవలం సినిమాలు తీయటంతోనే ఆగకుండా 1989లో రామానాయుడు స్టూడియోను నిర్మించి సినిమా షూటింగులకు వేదికను ఏర్పాటు చేశారు. కేవలం తెలుగులోనే కాకుండా దేశ వ్యాప్తంగా 14 భాషల్లో సినిమాలు నిర్మించి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులకు ఎక్కారు. కేవలం సినిమా రంగంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా ప్రవేశించారు. 1999-2004 మద్యకాలంలో బాపట్ల ఎంపీగా పనిచేశారు. ఇక తండ్రి లాగే సురేష్ సినిమాలు నిర్మిస్తుండగా.., విక్టరీ వెంకటేష్ అగ్ర హీరోల్లో ఒకరిగా ఉన్నాడు. దశాబ్దాల పాటు ఇండస్ర్టీకి సేవలందించి ప్రపంచ గుర్తింపు పొందిన ఇలాంటి వ్యక్తి గురించి ఈ తరహా వార్తలు వినటం బాధాకరం. ఈ పుకార్లు నిజం కావద్దనీ.., రామానాయుడు త్వరగా కోలుకోవాలని ‘తెలుగు విశేష్’ కోరుకుంటోంది.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : d.ramanaidu sick  venkatesh updates  tollywood latest  

Other Articles