Milky beauty tamanna bhatia five security guards hero arya vasuvum sivavum onna padichittanga tamil movie

tamanna bhatia, tamanna bhatia hot photos, tamanna bhatia hot photos, tamanna bhatia tamil movies, tamanna bhatia gallery, tamanna bhatia sexy photos

milky beauty tamanna bhatia five security guards hero arya Vasuvum Sivavum Onna Padichittanga tamil movie

తమన్నాను చుట్టుముట్టేసిన బాడీగార్డులు

Posted: 11/29/2014 06:48 PM IST
Milky beauty tamanna bhatia five security guards hero arya vasuvum sivavum onna padichittanga tamil movie

మిల్కీబ్యూటీ తమన్నా టైమ్ అంతగా బాగోలేనట్టు కనిపిస్తోంది. ఎందుకంటే.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిపోదామని బాలీవుడ్’లో అడుగుపెడితే.. అక్కడ వరుసగా పరాజయాలే దక్కాయి. ఇక తెలుగులో మహేష్ సరసన నటించిన ‘‘ఆగడు’’ లాంటి భారీ బడ్జెట్ సినిమా కూడా అడ్రస్ లేకుండా పోయింది. అందుకే.. ఇకనుంచైనా సినిమా ఎంపిక విషయాల్లో అమ్మడు చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ అమ్మడికి చాలాకాలం తర్వాత తమిళంలో ఓ ఆఫర్ లభించింది. అయితే అక్కడ కూడా ఈమెకు అవాంతర ఘటనలు చోటు చేసుకుంటున్నాయని సమాచారం!

అసలు విషయం ఏమిటంటే.. మిల్కీబ్యూటీ ఆర్య హీరోగా నటిస్తున్న ‘‘వాసువుం సివవుం ఒన్న పడిచ్చితంగా’’ అనే తమిళ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. చాలాగ్యాప్ తర్వాత తమిళంలో నటిస్తున్న కారణంగా అక్కడి మీడియావాళ్లు ఈమెను తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారట! ‘‘మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా..? అసలు మీరు హిందీలో ఎందుకు, ఎలా ఫెయిల్ అయ్యారు..? సమాధానం ఇవ్వండి’’ అంటూ ప్రశ్నిస్తున్నారట! అయితే అందుకు ఏమాత్రం సమాధానమివ్వకుండా తమన్నా జారుకుంటోందట! ఇలా ఒక్కసారి కాదు.. బయట కనిపించిన ప్రతిసారి మీడియావాళ్లు మైకులు పట్టుకుని తమన్నా ముందు వాలిపోతున్నారట!

దీంతో మీడియవాళ్లు అడిగే ప్రశ్నలకు తమన్నా ఎక్కడ మూడవుట్ అవుతుందోనని ఆ చిత్రబృందం భయపడుతోందట! ఒకవేళ ఆమె మూడవుట్ అయితే, ఆ ప్రభావం తమ సినిమాపై పడుతుందని, మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతుందేమోనన్న భయంతో దర్శకనిర్మాతలు ఆమెకు రక్షణగా బాడీగార్డులను నియమించారని తెలుస్తోంది. దాంతో మె చుట్టూ ఎప్పుడూ ఐదారుగురు సెక్యూరిటీ వాళ్ళు కాపలా ఉంటున్నారు. ఈ దెబ్బతో ఆమెను సమీపించే అవకాశం ఎవరికీ లేదు. ఒకవేళ కలవాలన్నా... ముందుగా పర్మిషన్ తీసుకోవాల్సి వుంటుందన్నమాట! ఏదైతేనేం.. ఆ ఘటనతో అమ్మడు మళ్లీ వార్తల్లోకొచ్చేసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamanna bhatia  tamil movies  telugu actresses  telugu news  

Other Articles