Prabhas next movie with sujeeth

prabhas next movie, prabhas next movie name, prabhas latest news updates, prabhas bahubali photos, bahubali teaser trailer, prabhas movie with sujeeth, tollywood latest updates, director sujeeth next movie updates

prabhas next movie with sujeeth : young rebal star prabhas presently busy with bahubali, this periodical movie first part will release by april 2015. prabhas next movie will be with sujeeth

పెళ్ళికి డేట్లు ఖాళీ లేవు !!

Posted: 11/25/2014 03:27 PM IST
Prabhas next movie with sujeeth

పెద్ద హీరోకు ఒకే సినిమా కోసం ఏళ్ళ తరబడి నిరీక్షించటం అంటే ఎంత కష్టంగా ఉంటుందో చెప్పలేము. వరసగా ఆఫర్లు వస్తున్నా వాటిని కాదనుకుని ఒకే సినిమా కోసం మొక్కవోని దీక్షతో పనిచేయటం అంటే చాలా కష్టం. కాని ప్రభాస్ ఎంతో ఇష్టంగా ఒకే సినిమాను చేస్తున్నాడు. రెండేళ్ళుగా మిగతా ఆఫర్లు వదులుకుని ‘బాహుబలి’కోసం పనిచేస్తున్నాడు. ఇక డార్లింగ్ కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. ‘బాహుబలి’ సినిమా త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల అయ్యేందుకు సిద్దమవుతోంది.

పీరియాడికల్ సినిమా పూర్తి అవుతుండటంతో ఇక మిగతా ప్రాజెక్టులపై ప్రభాస్ దృష్టిపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ డైరెక్టర్లు టాల్ బాయ్ ఇంటికి క్యూ కడుతున్నారట. పరిగెత్తే టైటిల్ తో  సినిమా  తీసిన సుజీత్్ అందరికంటే ముందే వచ్చి డార్లింగ్ కు కథ విన్పించాడు. ఈ ప్రాజెక్టు చేసేందుకు సుముఖత  వ్యక్తం చేసిన ప్రభాస్, కథను సిద్ధం చేసుకోవాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. దీంతో రన్ రాజా రన్ అనుకుంటూ సుజీత్ ఇంటి కెళ్లిపోయి పెన్ను తీసుకుని కథను సిద్దం చేసుకుంటున్నాుడు.  

ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి. క్రియేషన్స్ బ్యానర్ పై ప్రభాస్ బంధువు ప్రమోద్ ఈ సినిమాను నిర్మిస్తాడని తెలుస్తోంది. షూటింగ్ విషయానికి వస్తే.., 2015లో ప్రారంభం అవుతుందట. సినిమాపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినా.., ఫిలింనగర్ వర్గాలు మాత్రం సుజ్జికి సినిమా ఆఫర్ ఖాయమైంది అని చెప్తున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ.., బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ పెళ్లికొడుకు  అవుతాడని కృష్ణంరాజు ప్రకటించారు. మరి మూడుముళ్ల బంధం సుజిత్ సినిమా తర్వాతా లేక ముందా అనేది వెయిట్ అండ్ సీ అనుకొండి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prabhas  sujeeth  bahubali  tollywood  

Other Articles