Sruti hassan in nagarjuna movie

nagarjuna multistarrer movie, nagarjuna karthi multistarrer movie, sruti hassan in nagarjuna multistarrer movie, sruti hassan in vijay movie, sruti hassan issue with mahesh babu, mahesh babu koratala shiva latest update, tollywood latest updates sruti hassan movie

sruti hassan in nagarjuna multistarrer movie : tollywood king nagarjuna latest multistarrer movie will be coloured with sruti hassan beside nagarjuna, sruti hassan now doing mahesh babu movie also agrees to act in nagarjuna karthi multi starrer movie

మహేష్ ను ఆపేసి.. మన్మధుడికి బాణం వేసింది

Posted: 11/25/2014 05:13 PM IST
Sruti hassan in nagarjuna movie

టాలీవుడ్ లో శృతి హాసన్ పేరు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మహేష్ బాబు సినిమా షూటింగ్ నుంచి వెళ్లిపోయి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ అమ్మడు తాజాగా మరో సంచలన వార్తను తీసుకొచ్చింది. నాగార్జున హీరోగా వస్తున్న మల్టీస్టారర్ సినిమాలో శృతి హీరోయిన్ గా ఎంపిక అయిందట. తమిళ నటుడు కార్తితో కలిసి నాగ్ చేస్తున్న ఈ మూవీలో శృతి కింగ్ సరసన నటించనుంది. ఇక కార్తి పక్కన ఎవరనేది తేలాల్సి ఉంది.

కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న మల్టీస్టారర్ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయింది. సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ‘మనం’ ఫ్యామిలి మల్టీస్టారర్ కాగా.., ఆ సినిమా తర్వాత నాగార్జున చేస్తున్న ప్రాజెక్టు ఇదే కావటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందిస్తున్నారు. ఫ్యామిలి ఎంటర్ టైనర్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇక మహేష్ సినిమా విషయానికి వస్తే.., కొరటాలతో చేస్తున్న తాజా సినిమా శృతి హాసన్ వల్ల తాత్కాలికంగా ఆగిపోయింది. తమిళ హీరో విజయ్ మూవీకి ఇచ్చిన బల్క్ డేట్ల కారణంగా ఈమె ఆ మూవీలో నటిస్తుండటంతో ప్రిన్స్ ప్రాజెక్టు వెయిట్ చేయక తప్పటం లేదు. షూటింగ్ కు రాలేకపోవటంపై శృతి సన్నిహిత వర్గాలు వివరణ ఇచ్చాయి. జ్వరంతో బాధపడుతున్నందునే ఆమె షూటింగ్ లో పాల్గొనటం లేదని చెప్పారు. త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది అని చెప్పారు.

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nagarjuna  sruti hassan  mahesh babu  karthi  multistarrer  

Other Articles