Second heroine in gabbarsingh2

gabbarsingh2 heroine, gabbarsingh2 second heroine, gabbarsingh2 latest updates, gabbarsingh2 shooting date, gabbarsingh2 movie cast and crew, gabbarsingh2 pawan kalyan photos, pawan kalyan latest updates, anisha ambrose latest, anisha ambrose photo with pawan, gabbarsingh2 second heroine name, tollywood latest updates

second heroine in gabbarsingh2 : power star pawan kalyan latest movie gabbar singh2 will be with two heroines first one anisha ambrose already selected and second heroine will be for glamorous role in movie

అనిషాకు పవన్ అన్యాయం.. సవతిపోరుతో తప్పని ఇబ్బందులు

Posted: 11/19/2014 03:27 PM IST
Second heroine in gabbarsingh2

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘గబ్బర్ సింగ్2’ హీరోయిన్ కు చెప్పలేనన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. పవర్ స్టార్ తో తొలి సినిమా చాన్స్ కొట్టేసిన ఆయన వీరాభిమానికి ఉన్నట్లుండి సవతిపోరు మొదలైంది. ఇప్పటివరకు సినిమాలో ఒకే హీరోయిన్ అనుకున్నాం. కాని ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మొదటి హీరోయిన్ అనిషా అని ముందే తెలుసు. ఇక రెండవ హీరోయిన్ ఎవరనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సెకండ్ హీరోయిన్ పేరును సినిమా యూనిట్ పరిశీలిస్తోంది.

ఫస్ట్ హీరోయిన్ ఉండగా మరొకరు ఎందుకని అడిగితే గ్లామర్ క్యారెక్టర్ కోసం సెకండ్ హీరోయిన్ అని అంటున్నారు. అనిషా హీరోయిన్ రేంజ్ హెవీ గ్లామరస్ గర్ల్ కాకపోవటంతో సినిమాలో ఈ కొరత కన్పించే అవకాశం ఉంది. ఇదే జరిగితే కలర్ లేక సినిమా కళతప్పి పోయే ప్రమాదమూ ఉంది. దీన్ని గ్రహించిన మూవీ యూనిట్ అనిషా పక్కన మరో అందగత్తెను ఎంపిక చేసే పనిలో ఉంది. చెప్పా పెట్టకుండా వెళ్ళి చాన్స్ పట్టేసి సంచలనం కల్గించిన అనీషా భామ ఈ వార్తతో షాక్ కావటం ఖాయంగా తెలుస్తోంది.

పవన్ సినిమాలో నటిస్తే ఎంత క్రేజ్ ఉంటుందో తాజాగా ప్రణితతో రుజువయింది. అలాంటి బంపర్ ఆఫర్ కొట్టేసినా.., గ్లామర్ తక్కువగా ఉండటంతో ఈ రోల్ మరొకరికి ఇచ్చారు. దీంతో ‘గబ్బర్ సింగ్2’లో అనిషా కంటే రాబోయే అందగత్తే ఎక్కువగా మెరవనుంది. కాసేపు కన్పించినా సరే కన్నులపండగ చేసే అవకాశం ఉంది. దీంతో పవన్ సినిమాలో చేసినా అనిషాకు పెద్దగా పేరు ఉండదని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. సినిమా మొదలు కాకముందే సవతిపోరు షురూ కావటంతో గబ్బర్ సింగ్ తో ఎలా నెట్టుకొస్తుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘పవర్’ ఫేం కే.ఎస్. రవీంద్ర డైరెక్షన్ లో డిసెంబర్ లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gabbarsingh2  anisha ambrose  second heroine  tollywood  latest news  

Other Articles