Nagarjuna latest movie soggade chinni naayana shooting started

nagarjuna latest movie update, nagarjuna multistarrer movie update, nagarjuna movie with karthi, nagarjuna in soggade chinni naayana, soggade chinni naayana latest update, soggade chinni naayana photos, soggade chinni naayana shooting, soggade chinni naayana cast and crew, nagarjuna with lavanya tripati movie, tollywood latest news update

nagarjuna latest movie soggade chinni naayana shooting started : all think that nagarjuna next movie will be a multi starrer but nagarjuna made a shocking and un expected turn, he is acting presently in soggade chinni naayana shooting started on 19th november says tollywood people

ఒక్క దెబ్బతో అందరికి షాక్ ఇచ్చిన సోగ్గాడు

Posted: 11/19/2014 11:45 AM IST
Nagarjuna latest movie soggade chinni naayana shooting started

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున అభిమానులందరికి షాక్ ఇచ్చాడు. ఆయన తదుపరి సినిమా మల్టీస్టారర్ అనుకుంటే అలా కాకుండా సోలోగా వస్తున్నాడు. మల్టీస్టారర్ కంటే ముందుగా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా విడుదల కానుంది. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది కాబట్టి. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ షూటింగ్ ను బుధవారం రోజు (నవంబర్ 19) ప్రారంభించారని తెలుస్తోంది. ఇలా ఎవరూ ఊహించనివిధంగా.., ఎవరికీ చెప్పకుండా సైలెంట్ గా సినిమా షూటింగ్ మొదలు పెట్టారని తెలుస్తోంది.

ఈ సినిమాలో డ్యూయల్ రోల్ పోషిస్తున్న నాగార్జున ఇద్దరు హీరోయిన్లతో కలిసి నటించనున్నారు. అందులో ఒకరు సీనియర్ నటి రమ్యకృష్ణ కాగా..., మరొకరు ‘అందాల రాక్షసి’ ఫేం లావణ్య త్రిపాఠి. కళ్యాణ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాధా మోహన్ కధ అందించారు. ఇప్పటికే బాగా ప్రచారంలో ఉన్న ‘సోగ్గాడే చిన్ని నాయనా’ టైటిల్ సినిమాకు దాదాపు ఖరారయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తాము.

కార్తితో కలిసి నాగార్జున ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని పీవీపీ బ్యానర్స్ నిర్మిస్తోంది. మిల్కీ బ్యూటి తమన్నా ఇందులో చాన్స్ కొట్టేసినట్లు ఊహాగానాలు వస్తున్నాయి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : soggade chinni naayana  nagarjuna  tollywood  shooting  multistarrer  

Other Articles