Gabbarsingh2 schedule date fixed

gabbarsingh2 schedule, gabbarsingh2 latest updates, gabbarsingh2 shooting dates, gabbarsingh2 heroine, gabbarsingh2 director, gabbarsingh2 cast and crew, gabbarsingh2 photos latest stills, pawan kalyan next movie, Anisha Ambrose latest photos, Anisha Ambrose in gabbarsingh2, tollywood latest news

gabbarsingh2 schedule date fixed : pawan kalyan most awaited sequel gabbarsingh2 all set to start shooting from december says filmnagar people. Anisha Ambrose is heroine for gabbarsingh2 movie and it will start shooting in december

ఫ్యాన్స్ కు ఇక పండగే : వచ్చేనెల నుంచి గబ్బర్ సింగ్2

Posted: 11/13/2014 05:09 PM IST
Gabbarsingh2 schedule date fixed

పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘గబ్బర్ సింగ్2’ సినిమా షెడ్యూల్ డేట్ వచ్చేసింది. వచ్చే నెల అంటే డిసెంబర్ నుంచి ఈ మూవీ షూటింగ్ మొదలు కానుంది. అంతేకాకుండా ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి. సినిమాను బాబీ నే డైరెక్ట్ చేస్తాడని.., ఇది కన్ఫర్మ్ అయిందని చెప్తున్నారు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే అనిషా అంబ్రోస్ పవన్ సరసన ఈ ప్రాజెక్టులో నటిస్తుందని తెలుస్తోంది. హీరోయిన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అనిషాలో అన్ని యాంగిల్స్ ఆడిషన్స్ చేసి.. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని సినిమాలో ఛాన్స్ ఇచ్చారని తెలుస్తోంది.

ఈ ప్రాజెక్టును పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నాడు. సినిమాలో ఇతర నటీనటుల వివరాలు చూస్తే, బ్రహ్మానందం, అలీ, నర్రా శ్రీను, తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతానికి ఈ వివరాలు బయటకు వచ్చాయి. వీటిని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇప్పుడయితే ఈ వార్త తెలిసిన ఫ్యాన్స్ సంతోషంలో మునిగితేలుతున్నారు. పవర్ స్టార్ సినిమా షూటింగ్ మొదలైందంటే ఇక తమకు పండగే అంటున్నారు వారంతా.

గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ ఇన్ స్పిరేషన్ తో పవన్ ‘గబ్బర్ సింగ్2’ సినిమా కధ రాసుకున్నాడు. దీని డైరెక్షన్, షూటింగ్ షెడ్యూల్ అనేక మలుపులు తిరిగింది. ముందుగా సంపత్ నంది డైరెక్ట్ చేస్తాడు అన్నారు. కొంతకాలం పాటు సినిమా కోసం వేచి చూసిన నంది.., పలు కారణాలతో ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చి వేరే సినిమా చేస్తన్నాడు. ఆ తర్వాత పలువురు డైరెక్టర్ల పేర్లు విన్పించాయి. చివరకు బాబీ పేరు ప్రచారంలోకి వచ్చి ఆయనే ఫైనలైజ్ అయ్యారు. అటు షూటింగ్ కూడా ఎప్పుడు మొదలు పెడతారు అనేది మొదట్లో తెలియలేదు. ‘గోపాల గోపాల’ తర్వాత అని కొందరు.., సంక్రాంతి తర్వాత అని మరికొందరు ఇలా చాలా గుసగుసలు విన్పించాయి. చివరకు డిసెంబర్ లో బాబీ డైరెక్షన్ లో అనిషా హీరోయిన్ గా సినిమా సెట్స్ పైకి వెళ్తోందన్నమాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  gabbarsingh2  Anisha Ambrose  latest news  

Other Articles