Gopala gopala pawan kalyan role latest update

pawan kalyan in gopala gopala movie, pawan kalyan latest updates, pawan kalyan gopala gopala photos, gopala gopala trailer, venkatesh in gopala gopala movie, sreya in gopala gopala latest update, tollywood latest news updates

gopala gopala pawan kalyan role latest update : here is a latest update about power star pawan kalyan gopala gopala movie that pawan again coming for shooting

పవన్ మళ్లీ వచ్చేస్తున్నాడు

Posted: 11/13/2014 03:44 PM IST
Gopala gopala pawan kalyan role latest update

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘గోపాల గోపాల’ షూటింగ్ పూర్తికావస్తోంది అని వార్తలు వచ్చాయి. దీనికి తోడు పవన్ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తయింది అని కూడా గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం సినిమాలో పవన్ పార్ట్ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదట. ఇంకా షూటింగ్ మిగిలి ఉంది అని సినిమా యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. మరో వారం రోజుల్లో ఆయనపై షూట్ ప్రారంభం అవుతుంది అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మాటలు, సెట్ తదితర పనులు చేస్తున్నారు.

పవన్-వెంకటేష్ కాంబినేషన్ లో ఉండే సీన్లు వచ్చే వారం నుంచి షూట్ చేస్తారని అంటున్నారు. అయితే కాశీ షెడ్యూల్ గురించి ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కిశోర్ డాలి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సురేష్ బాబు, శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో వెంకటేష్ హీరోగా శ్రియ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ నెలాఖరులో ఫస్ట్ లుక్ విడుదల చేసి డిసెంబర్ లో ఆడియోను ప్రేక్షకులకు అందించనున్నారు. అదేవిధంగా సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తామని చెప్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  gopala gopala  latest news  tollywood  

Other Articles