Ram charan reaction on dasari narayana rao comments in open heart with rk programme

ram charan, ram charan latest news, ram charan latest photos, ram charan movies, ram charan open heart with rk, open heart with rk programme, dasari narayana rao, dasari narayana rao comments, ram charan dasari narayana rao, chiranjeevi, mega family

ram charan reaction on dasari narayana rao comments in open heart with rk programme

దాసరి ‘‘మెగా’’ కామెంట్లపై రామ్ చరణ్ రియాక్షన్!

Posted: 10/28/2014 03:27 PM IST
Ram charan reaction on dasari narayana rao comments in open heart with rk programme

దాసరి, మెగా కుటుంబాల మధ్య వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు వున్నాయో తెలియదు కానీ.. దాసరి నారాయణరావు మాత్రం పరోక్షంగా అప్పుడప్పుడు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. దాసరి చేసిన వ్యాఖ్యలపై చిరు అంతగా ఎప్పుడూ స్పందించలేదుగానీ.. ఆయన కుమారుడు రాంచరణ్ మాత్రం కాస్త ఘాటుగానే బదులిచ్చిన సందర్భాలూ వున్నాయి. ఇక మేటర్ లోకి వస్తే.. మొన్నీమధ్యే ఒక ఆడియో ఫంక్షన్ లో భాగంగా దాసరి మాట్లాడుతూ.. ‘‘ఈమధ్య కొంతమంది హీరోలు తమ కుమారుల మొఖాలు చెక్కిచెక్కి మరీ సినిమాల్లో కనిపిస్తుంటారు. పరిశ్రమలో దౌర్జన్యం ఎక్కువగా పెరిగిపోతోంది’’ అంటూ తీవ్రంగా కామెంట్లు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలు మెగాకుటుంబసభ్యులను దృష్టిలో పెట్టుకునే దాసరి అలా మాట్లాడారని.. గతంలో వున్న విభేదాల నేపథ్యంలోనే తన అక్కసును వెళ్లగక్కారని పరిశ్రమలో జోరుగా ప్రచారాలు సాగాయి. దీనిపై చిరు స్పందించలేదుగానీ.. రామ్ చరణ్ మాత్రం మళ్లీ స్పందించాడు.

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో చరణ్ పాల్గొన్న విషయం తెలిసిందే! ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఆర్కే దాసరి చేసిన కామెంట్లపై చరణ్ తో కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘‘గతంలో దాసరి చేసిన ఎందుకంతా రియాక్ట్ అయ్యారు?’’ అని అడిగితే.. అందుకు చరణ్ బదులిస్తూ.. ‘‘నేను ఇంట్లో కూడా అలాగే వుంటాను. ఎవరైనా ఏదైనా అంటే వెంటనే రియాక్ట్ అవుతాను. మా అమ్మతో కూడా వాదోపవాదాలు జరుగుతుంటాయి. పడితే గొడవ పడ్తాను.. లేదా సైలెంటుగా వుంటాను. నాలో వున్న ఈ యాటిట్యూడ్ వల్లే అప్పట్లో దాసరి చేసిన కామెంట్లపై రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు అటువంటి కామెంట్లపై నేనేమి పట్టించుకోవట్లేదు. వాటికి సమాధానమిచ్చి అనవసరంగా సమయాన్ని వృధా చేయదలచుకోలేదు. అందుకు సమాధానం ఇవ్వడం కూడా వేస్ట్ అని అనిపిస్తుంది’’ అంటూ బదులిచ్చాడు చెర్రీ!

అలాగే దాసరితో తమ కుటుంబానికికున్న సంబంధం గురించి మాట్లాడుతూ.. ‘‘దాసరిగారంటే నాకు చాలా గౌరవముంది. నాన్నగారితో ఆయనకు మంచి అనుబంధముంది. ఎప్పుడైనా కలిసినప్పుడు చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. వాళ్లమధ్య వైర్యాలు ఏమున్నాయో నాకైతే తెలియదు కానీ.. కలిసినప్పుడు బాగానే మాట్లాడుకుంటారు. కానీ మైకు పట్టుకున్నప్పుడే ఏమౌతుందో తెలియదు’’ అన్నాడు. అలాగే దాసరి తాజాగా చేసిన ప్లాస్టక్ ఫేస్ ల కామెంట్ల గురించి అడగగా.. ‘‘ఆ కామెంట్లు ఎవరు మీద చేశారో నాకు తెలియదు. నా పేరు వాడి వుంటే ఫీల్ అయ్యేవాణ్ణి.. అయినా ఆయన ఎవరిని ఉద్దేశించి అలా అన్నారో మరి!’’ అంటూ చెప్పుకొచ్చాడు. చివరగా తాను చెప్పిందేమిటంటే.. గతకొద్దికాలం నుంచి అతను కామెంట్లపై రియాక్టవ్వడం లేదని.. సైలెంటుగా తన పని తాను చేసుకుంటున్నానంటూ తెలిపాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram charan  dasari narayana rao  chiranjeevi  mega family  open heart with rk programme  

Other Articles