Sruthi hassan taking highest remuneration for koratala siva and mahesh babu combination movie

sruthi hassan, sruthi hassan latest news, sruthi hassan remuneration, mahesh babu latest news, sruthi hassan hot photos, sruthi hassan hot photo shoot, sruthi hassan hot gallery, sruthi hassan mahesh babu, mahesh babu news, mahesh babu movies, director koratala siva

sruthi hassan taking highest remuneration for koratala siva and mahesh babu combination movie which is highest amount in south industry

‘‘శృతి’’మించిన రేంజితో బాక్సు బద్దలుకొట్టేసింది!

Posted: 10/28/2014 02:34 PM IST
Sruthi hassan taking highest remuneration for koratala siva and mahesh babu combination movie

లోకనాయకుడు కుమార్తె అయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదటి సినిమానుంచే శృతిహాసన్ తన అందాలను దాదాపు ఆరబోస్తున్న విషయం తెలిసిందే! ఆమధ్య న్యూడ్ గా కనువిందు చేయడానికి కూడా తాను సిద్ధమేనంటూ సంచలన స్టేట్ మెంట్ కూడా ఇచ్చేసింది. అటువంటి సన్నివేశాలు చాలావరకు మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వుండవు కాబట్టి... బికినీ మాత్రం ధరించి ప్రేక్షకులను ఓ మోస్తరు సంతృప్తి పరిచింది. స్టార్ డమ్ ను సంపాదించుకోవడం కోసం దేనికైనా రెడీ అంటూ కామెంట్లు కూడా చేసిన సందర్భాలూ వున్నాయి.

అయితే ఇండస్ట్రీలో వచ్చిన మొదట్లో ఈ అమ్మడి నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో ఐరెన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది. దానిని చెరిపేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతగా ఫలించలేదుకానీ.. తర్వాత పవన్ ‘‘గబ్బర్ సింగ్’’ ఆమె దశనే మార్చేసింది. తెలుగు, తమిళంలో వరుసగా విజయాలు సాధించుకుంటూ నేడు స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఇక స్టార్ డమ్ వచ్చేసింది కదా.. ఇతర కథానాయికల లాగే ఈ అమ్మడు కూడా డోసు పెంచేసింది. అయితే ఈసారి డోస్ పెంచింది ఎక్స్ పోజింగ్ లో కాదులెండి.. తన రెమ్యునరేషన్ స్థాయిని ఈ అమ్మడు భారీ స్థాయికే పెంచేసిందని వార్తలు వస్తున్నాయి.

ప్రిన్స్ మహేష్ బాబు - డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్లు అందరికీ తెలిసిందే! ఈ సినిమాను కొత్తగా టాలీవుడ్ లో అడుగుపెడుతున్న మైత్రీ మూవీస్ అధినేతలు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ కోసం సమంత, కాజల్, తమన్నాలతోపాటు ఇతర హీరోయిన్లను కూడా పరీక్షించారు. అయితే సమంతతో మహేష్ కటీఫ్ చెప్పేయడం, కాజల్ ఇండస్ట్రీకి కాస్త దూరం జరగడం, తమన్నాతో ‘‘ఆగడు’’ డిజాస్టర్ అయిన నేపథ్యంలో వారిని పక్కనపెట్టేశారు. దీంతో ఎవరినీ తీసుకోవాలా..? అని డైలామాలో వున్న సందర్భంలో శృతిహాసన్ ను సంప్రదించారట! పైగా ఆ అమ్మడు ఎంత రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా ఇవ్వడానికి సిద్ధమయ్యారట ఆ మూవీ నిర్మాతలు!

దీంతో ఈ మూవీ నిర్మాతలు తమ సినిమాలో హీరోయిన్ గా నటించాల్సిందంటూ శృతిని సంప్రదిస్తే.. ఆమె ఏకంగా 1.25 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట! దీంతో మరోమాట ఆలోచించకుండా నిర్మాతలు ఆమెను తమ సినిమాలో ఆఫర్ ఇచ్చేశారని సమాచారం! ఈ దెబ్బతో ఈ అమ్మడు సౌత్ ఇండస్ట్రీలో అత్యధికంగా పారితోషికం తీసుకునే కథానాయికల జాబితాలో చేరిపోయింది. నిజానికి కొంతమంది తారలు ఇప్పటికీ కోటిరూపాయల వరకు మాత్రమే పారితోషికాన్ని తీసుకుంటున్నారు.. ఇప్పుడు వారందరికీ మించి శృతి ఇంకా 25 లక్షలే ఎక్కువే (1.25 కోట్లు) తీసుకోబోతోందని.. ఈ విషయంలో ‘‘శృతి’’ బాగానే మించిపోయిందని చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sruthi hassan  mahesh babu  director koratala siva  tollywood news  telugu news  

Other Articles