Dsp tribute to michael jackson

Devi Sri Prasad pays tribute to Michael Jackson, Devi Sri Prasad Tribute to Michael Jackson, Devi Sri Prasad to give musical tribute to Michael Jackson, Devi Sri Prasad To Give Musical Tribute To Michael, Devi Sri Prasad Michael Jackson news, Devi Sri Prasad news, Devi Sri PrasadDevi Sri Prasad pays tribute to Michael Jackson, Devi Sri Prasad Tribute to Michael Jackson, Devi Sri Prasad to give musical tribute to Michael Jackson, Devi Sri Prasad To Give Musical Tribute To Michael, Devi Sri Prasad Michael Jackson news, Devi Sri Prasad news, Devi Sri Prasad

Music Director Devi Sri prasad ... to share his love for Michael Jackson and the details of his album 'Jalsa'. He has got some big plans for the Music Icon's next Birth Anniversry. ...

కింగ్ ఆఫ్ పాప్ కోసం దేవి జల్సా

Posted: 08/28/2014 11:34 AM IST
Dsp tribute to michael jackson

ప్రముఖ పాప్ సింగర్, స్టైలిష్ డాన్సర్ మైఖేల్ జాక్సన్ ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే. మైఖేల్ మరణించినా కూడా ఇప్పటికీ ఆయన పేరు, పాటలు మారుమ్రోగుతూనే వున్నాయి. ఎందరో సంగీత దర్శకులకు, గాయకులకు, డాన్సర్లకు మైఖేల్ ఓ స్పూర్థి. మైఖేల్ స్టేజ్ షో ఇస్తున్నాడంటేనే కొన్ని కోట్ల మంది ఎంతో ఆతృతతో ఎదురు చూస్తుండేవారు. అయితే హాలీవుడ్ లో మైఖేల్ ఎలాగో మన సౌత్ ఇండస్ట్రీకి దేవి కూడా అలాగే అన్నట్లుగా తయారయ్యాడు యువ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్.

టాలీవుడ్ టాప్ 1 సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. దేవి చేసే ప్రతి సినిమా ఖచ్చితంగా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్. దేవి ఎనర్జీ, హుషారు చూస్తుంటే మతిపోతుంది. అలాంటి దేవికి ప్రముఖ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ అంటే చాలా ఇష్టం. దేవికి మైఖేల్ స్పూర్థి అని చెప్పుకోవచ్చు.

అందుకే తన అభిమాన గాయకుడికి దేవి ఓ పాట రూపంలో నివాళులర్పించబోతున్నాడు. ఈ విషయం గురించి దేవి మాట్లాడుతూ... ‘ఈ శుక్రవారం మైఖేల్ జన్మదినం. ఈ సంధర్భంగా ‘జల్సా.... ఎంజే’ పేరిట ఓ పాటను రూపొందించాను. తెలుగు, ఇంగ్లీష్ పదాల కలగలిసి సాగుతుంది. ఈ పాటను గురువారం రాత్రి 12 గంటలకు యూట్యూబ్ ద్వారా విడుదల చేయబోతున్నాం’ అని చెప్పుకొచ్చాడు.

దేవి ఇటీవలే విదేశాల్లో ప్రత్యేక స్టేజ్ షో ప్రదర్శనలిచ్చి ఇండియా చేరుకున్నారు. దేవి ఇండియాలో వున్నా లేకపోయినా కూడా సౌత్ దర్శక,నిర్మాతలు మాత్రం ఆయననే కావాలంటూ తమ సినిమాలకు సంగీత దర్శకునిగా ఎంచుకుంటున్నారు. దేవి చేతిలో ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలున్నాయి. మరి మైఖేల్ కోసం దేవి రూపొందించిన ఆ పాట మరికొద్ది గంటల్లో మీకు అందిస్తాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Devi Sri Prasad  Michael Jackson  Devi Michael Jalsa  Devi tribute  

Other Articles