Bipasha basu blames director sajid khan hamshakals movie

bipasha basu latest news, bipasha basu hot photo shoot, bipasha basu hamshakals movie, bipasha basu sajid khan, bipasha basu blame sajid khan, bipasha basu movies, bipasha basu hot stills, bipasha basu interview

bipasha basu blames director sajid khan hamshakals movie : bollywood hot and bold actress bipasha basu blames director sajid khan for not giving her importance while hamshakals movie shooting

సినిమాలో ఛాన్స్ ఇచ్చి.. నిండా మోసం చేశాడు! బిపాషా

Posted: 08/08/2014 07:06 PM IST
Bipasha basu blames director sajid khan hamshakals movie

(Image source from: bipasha basu blames director sajid khan hamshakals movie)

బాలీవుడ్ లో సెక్సీయెస్ట్ భామగా ఒక ప్రత్యేక ఇమేజీని క్రియేట్ చేసుకున్న బిపాషా బసుకు ఓ దర్శకుడు సినిమాలో నటించడానికి ఛాన్సిచ్చి, నిండా మోసం చేశాడట! ఈ మాటలు ఎవరో చెప్పింది కాదు.. స్వయంగా బిపాషా బసుయే తన తాజా ఇంటర్వ్యూలో సిగ్గు విడిచి చెప్పుకుంది. ‘‘అతను చెప్పిన మాయ మాటలకు పూర్తిగా లొంగిపోయానని... దాంతో అతను రెచ్చిపోయి నన్ను మోసం చేశాడని’’ ఆమె తన గత అనుభవాలను అందరి ముందు బహిర్గతం చేసింది. దీంతో షాక్ కు గురైన అందరూ.. ఆ దర్శకుడు ఎవరా..? అని ఆరా తీయగా.. ఈ అమ్మడు కుండబద్ధలు కొట్టింది.

బిపాషా బసు ఇటీవలే నటించిన ‘‘హమ్ షకల్స్’’ సినిమా గురించి అందరికీ తెలిసే వుంటుంది. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద పరాజయాన్ని మూటకట్టుకున్న విషయాన్ని పక్కనపెడితే... ఆ సినిమాను తెరకెక్కించిన సాజిద్ ఖాన్ గురించే ఇక్కడ చర్చంతా! ఈ సినిమాలో తనకు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వలేదని బిపాషా గతంలో సాజిద్ ఖాన్ పై మండిపడిన విషయం తెలిసిందే! అయితే బిపాషాలో ఆ ఆగ్రహం ఇంకా చల్లారినట్టు లేదు. మరోసారి బిప్స్ ఈ విషయం గురించి మాట్లాడుతూ సాజిద్ ఖాన్ పై విమర్శలు గుప్పించింది.

ఇందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ.. ‘‘సాజిద్ ఖాన్ ఆ సినిమాలో నన్ను దారుణంగా నిర్లక్ష్యం చేశాడు. అందులో నాది ముఖ్యమైన పాత్ర అయినప్పటికీ నన్ను తెరమీద కేవలం ఆరు నిమిషాలు మాత్రమే కనిపించేలా చేశారు. పైగా షూటింగ్ సమయాల్లో నన్ను పట్టించుకోకుండా తమన్నాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. నేను సెట్ లో వున్నా.. లేనట్టుగా అందరూ ప్రవర్తించేవారు. ఆ సినిమాలో నాకు మంచి పాత్రను ఇప్పిస్తానని మాటిచ్చి... అన్యాయం చేశాడు. అప్పుడు అతని మాయమాటలకు లొంగిపోయి నిండా మోసపోయాను. అందుకే.. ఈ జన్మలో మళ్లీ అతనితో కలిసి పనిచేయనని ఒట్టు పెట్టుకున్నాను’’ అని ఆవేశంతో తన అభిప్రాయాలను వెల్లడించింది.

అలాగే.. ‘‘సాజిద్ ఖాన్ నా ఫీలింగ్స్ తో ఆడుకుని నన్ను చాలా హర్ట్ చేశాడు. ఇంతేకాదు.. సినిమాను బాగా తెరకెక్కిస్తానని చెప్పి దాన్నీ పాడు చేశాడు. ఒకరి ఫీలింగ్స్ తో ఆడుకుంటే ఇటువంటి పరిణామాలే జరుగుతాయి. నేను కూడా ఇకనుంచి డిమాండ్ పాత్రల్లోనే నటిన్నాను. ఇప్పటికే నాకు చాలా నష్టం వాటిల్లింది’’ అని కొసమెరుపుగా వెల్లడించింది. కేవలం బిపాషా మాత్రమే కాదు.. ‘‘హమ్ షకల్స్’’ సినిమా ఘోరంగా పరాజయం కావడం వల్ల సాజిద్ ఖాన్ పై ఆ చిత్రంలో నటించిన నటులతోపాటు కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఇన్ డైరెక్ట్ గా తిట్టిపారేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles