Balakrishna movies gif

balakrishna latest news, nandamuri balakrishna news, balakrishna doop fights, balakrishna legend movie, trisha hot photo shoot, trisha hot photos, trisha balakrishna, balakrishna trisha, trisha movie, balakrishna movies

balakrishna action fights without doop in his next movie : nandamuri balakrishna doing action stunts without doops in his next movie. trisha is co actress

డూప్ లేకుండా రిస్కీ స్టంట్లు చేస్తున్న లెజెండ్

Posted: 08/08/2014 06:08 PM IST
Balakrishna movies gif

‘‘లెజెండ్’’ సినిమాతో నందమూరి చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించిన బాలకృష్ణ... ఐదుపదుల వయస్సుకు దగ్గరవుతున్నప్పటికీ నేటి యువతర స్టార్ హీరోలకు ధీటుగా బాగానే పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతమున్న సీనీయర్ హీరోల్లో కేవలం బాలకృష్ణ ఒక్కరే విభిన్న పాత్రల్లో నటిస్తూ.. పాతిక సంవత్సరాలు వున్న యువకుడి పాత్రల్లో కనువిందు చేస్తూ అందరికీ సవాల్ విసురుతున్నారు. ఇందుకు ఉదాహరణగా మనం లెజెండ్, సింహా లాంటి చిత్రాలను తీసుకోవచ్చు. ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే!

ఇదిలావుండగా... బాలాకృష్ణ హీరోగా తాజాగా మరో సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే! ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ సినిమాను సత్యదేవ దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్న సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. బాలయ్య ఈ సినిమాలో డూప్ లేకుండానే చాలా రిస్కీ స్టంట్స్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఐదుపదుల వయస్సుకు దగ్గరపడుతున్నకొద్దీ... నేటి యువతరానికి సవాల్ విసురుతూ బాలయ్య కూడా రియల్ రిస్కీ ఫైట్స్ చేస్తున్నట్టు చిత్రం బృందం తెలుపుతోంది.

ఈ నేపథ్యంలో నిర్మాత రుద్రపాటి మాట్లాడుతూ.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రంపచోడవరం, మారెడుపల్లి తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ మూవీ షెడ్యూల్ చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా ఇందులో బాలయ్య యాక్షన్ సన్నివేశాలో ఎంతో ఆసక్తికరంగా వుంటాయి’’ అని ఆయన అన్నారు. అలాగే చిత్రదర్శకుడు సత్యదేవ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో బాలయ్య - త్రిష మధ్య సన్నివేశాలు చాలా రొమాంటిక్ గా వుంటాయి. ఇతర నటీనటులు బాగానే నటించారు. ముఖ్యంగా ఆలీ కామెడీ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. లెజెండ్ సినిమాలానే అభిమానులను ఆకట్టుకునే విధంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles