Humaima malik relation with wasim akram

pakistan actress humaima mallik clarifies relation with wasim akram, humaima malik latest news, humaima malik with wasim akram, humaima malik relation with wasim akram, humaima malik hot photos, humaima malik hot photo shoot, humaima malik in raja natwarlal movie, humaima malik in sher movie, humaima malik affair with wasim akram

pakistan actress humaima mallik clarifies relation with wasim akram

ఆ క్రికెటర్ తో సహజీవనం చేయలేదు? పాక్ నటి

Posted: 07/25/2014 03:57 PM IST
Humaima malik relation with wasim akram

ప్రస్తుత కాలంలో సహజీవనం (లివ్-ఇన్-రిలేషన్ షిప్) చేయడం ఒక ఆచారంగా మారిపోయింది. ముఖ్యంగా ప్రముఖులు అయితే విచ్చలవిడిగా తాము సహజీవనం చేస్తున్నట్టు మీడియాముందుకొచ్చి మరీ ప్రచారాలు చేసుకుంటారు. ఇప్పటికే సినీ ప్రముఖుల్లో చాలామంది సహజీవనం చేస్తున్నారు. ఇదిలావుండగా... తాజాగా పాక్ నటి హుమైమా మాలిక్ పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ తో కలిసి చట్టాపట్టాలేసుకుని తిరుగుతోందని, వీరిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారని మీడియా, సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో వార్తలు షికార్లు చేశాయి. తొందరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోకున్నట్టు పుకార్లు వచ్చాయి.

అయితే మీడియాలో తనపై వస్తున్న ఇటువంటి వార్తలపై హుమైమా మాలిక్ స్పందించింది. తనకు, వసీం అక్రమ్ కు మధ్య అక్రమ సంబంధం లేదని, తమ మధ్య వున్నది కేవలం మంచి స్నేహమేనని ఆమె స్పష్టం చేసింది. తామిద్దరం ఎప్పటిలాగే స్నేహితులుగానే వుంటామే తప్ప... పెళ్లి చేసుకోవాలనే ఆలోచన అస్సలు లేదని ఆమె తెలిపింది. తమ మధ్య లేని సంబంధాన్ని అనవసరంగా వార్తలు ఎవరు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్న ఆమె... ఇకనుంచి ఇటువంటి వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా కోరుకుంది.

‘‘వసీం అక్రమ్ ఒక వివాహితుడు. పైగా అతను తండ్రి కూడా! అటువంటి వ్యక్తితో నేనెలా సంబంధం పెట్టుకోగలను! ఆయన మీద నాకు గౌరవం తప్ప మరే చెడు ఆలోచన లేదు’’ అని ఖరాఖండీగా చెప్పేసింది. ఇటువంటి వార్తలు ఎన్ని వచ్చినా తమ మధ్య వున్న స్నేహబంధం చెడదని ఆమె చెప్పింది. ప్రస్తుతం ఈ స్లిమ్ అండ్ హాట్ బ్యూటీ ఇమ్రాన్ హష్మీ సరసన ‘‘రాజా నట్వర్ లాల్’’ అనే చిత్రంలో నటిస్తోంది. గతంలో సంజయ్ దత్ సరసన ‘‘షేర్’’ సినిమాలో కూడా నటించింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles