Tapsee smoking 100 cigerettes per daily

tapsee smoking 100 cigerettes per daily, tapsee pannu latest news, tapsee pannu hot photos, tapsee hot photo shoot, tapsee tweet on smoking, tapsee revealed her smoking problem, tapsee twitter, tapsee hot photos, tapsee photo shoots, tapsee hot stills, tapsee in mumbai, tapsee smoking cigerettes

Tapsee gave humour response on fact-revealing organisation on smoking issue

తాప్సీ రోజుకు 100 సిగరెట్లు తాగుతుందట!

Posted: 07/18/2014 04:15 PM IST
Tapsee smoking 100 cigerettes per daily

అవును.. మీరు చదివింది అక్షరాలా నిజం! తాప్సీ రోజుకు 100 సిగరెట్లకుపైన స్మోకింగ్ చేస్తుందట! ఈ విషయాన్ని స్వయాన తాప్సీయే ట్విటర్ ద్వారా తెలిపింది. ‘‘వామ్మో! నేను రోజుకు వందసిగరెట్ల పొగను తాగుతున్నానా..?’’ అంటూ ఆశ్చర్యపోతూ ట్వీట్ చేసింది. దీంతో ఈమె ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ తిన్నారు. తన అభిమాన తార రోజుకు ఇన్ని సిగరెట్లు తాగుతుందా అంటూ వారు కూడా తాప్సీ చేసిన ట్వీట్ కి ట్వీట్లు కలుపుకుంటూ పోయారు. అయితే చివరికి తాప్సీ ఇచ్చిన సమాధానం చూసి అందరూ ఖంగుతిన్నారట!

అసలు విషయం ఏమిటంటే... తాప్సీ ఇక్కడ తాగుతోంది సిగరెట్లను కాదు... ముంబై గాలిని. తాజాగా ఉబెర్ ఫాక్ట్స్ చెబుతున్న లెక్కల ప్రకారం.. ముంబైలో నివాసం వుంటున్న జనం అక్కడ ఒకరోజులో పీల్చే కాలుష్యం దాదాపు వంద సిగరెట్లతో సమానం వుంటుందని పేర్కొంది. ముంబైలో ఎక్కువగా ఫ్యాక్టరీలు, ట్రాఫిక్, ఇంకా ఇతర కాలుష్య పదార్థాల వల్ల అక్కడి వాతావరణం రానురాను మరీ ఘోరంగా మారిపోతోందని ఆ సంస్థ పేర్కొంది. దీంతో సదరు గణాంకాల మీద స్పందించిన తాప్సీ... ఈ విధంగా తాను 100 సిగరెట్లు తాగుతున్నానంటూ అభివర్ణించింది.

ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ లో వరుస పరాజయాలను చవిచూసిన తాప్సీ పన్ను... తన సినిమా కెరీర్ ను బలపరుచుకోవడం కోసం బాలీవుడ్ కి మకాం మార్చింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో రెండు సినిమాల్లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఉబెర్ ఫాక్ట్స్ సంస్థ రిలీజ్ చేసిన ఈ సిగరెట్ల నివేదికను చూసి ఒక్కసారిగా షాక్ కు గురయిందట! అందులో భాగంగానే ఆమె.. ‘‘నేను ఇంతవరకు నాన్-స్మోకర్ అని తెగ సంబరపడిపోయేదాని. కానీ ఉబెర్ ఫాక్ట్స్ విడుదల చేసిన లెక్కలప్రకారం చూస్తే నేను కూడా స్మోకరేనని అర్థమయింది’’ అంటూ ట్వీట్ చేసింది. దీంతో తాప్సీ ఇచ్చిన క్లారిటీకి అభిమానులు ‘‘ఔనా!’’ అంటూ రకరకాలుగా ట్వీట్లు చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles