Rajamouli says sorry for mistake in alludu sreenu audio function

Rajamouli says sorry for mistake in alludu sreenu audio function, director rajamouli latest news, director rajamouli news, director rajamouli twitter, director rajamouli says sorry to vinayak, director rajamouli in allludu sreenu audio functioin, alludu sreenu in audio function

Rajamouli says sorry for mistake in alludu sreenu audio function

మెగాతప్పు చేసి సారీచెప్పిన రాజమౌళి

Posted: 07/01/2014 09:34 AM IST
Rajamouli says sorry for mistake in alludu sreenu audio function

(Image source from: Rajamouli says sorry for mistake in alludu sreenu audio function)

టాలీవుడ్ అగ్ర దర్శకుడు అయిన రాజమౌళి తాను చేసిన తప్పును ఒఫ్పుకుని, అందరికీ క్షమాపణలు అడిగాడు. ‘‘నానుంచి ఒక తప్పు జరిగిపోయింది. దానికి నేను క్షమాపణలు అడుగుతున్నాను’’ అని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అయితే దీనిని ఈ విషయం తెలియగానే సినీ విశ్లేషకులు, నెటిజన్లు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. టాలీవుడ్ రూపురేఖలు మార్చేసి, హాలీవుడ్ దశకు తీసుకెళ్లనున్న రాజమౌళి తప్పు చేయడమేంటి... క్షమాపణలు అడగడమేంటని అందరూ గందరగోళ పరిస్థితుల్లో మునిగిపోయారు. యావత్తు టాలీవుడ్ తో సహా ఆయన అభిమానులు కూడా తమ సందేహాలను వ్యక్తం చేశారు. ఆ తరువాత ఆరా తీస్తే... అసలు విషయం బయటకు వచ్చింది.

ఇంతకు జరిగిందేమిటంటే... మొన్న ఆదివారం (29.06.2014) హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరిగిన ‘‘అల్లుడు శ్రీను’’ ఆడియో పంక్షన్ కి బెల్లంకొండి సురేష్ మీద వున్నఅభిమానంతో గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ వేడుక సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్, దర్శకుడు వివి వినాయక్ గురించి ప్రశంసలు చేస్తూ మాట్లాడారు. దర్శకుడు వివి వినాయక్ మనసు చాలా సున్నితమైనదని.. ఆయనకు ఎమోషన్స్ చాలా ఎక్కువని అభిప్రాపడ్డాడు. ఇలా వినాయక్ గురించి చెబుతూ... ‘‘గతంలో వివి వినాయక్, మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘‘స్టాలిన్’’ చిత్రం తీయడానికి ఎంత కష్ట పడుంటారో... ఇప్పుడు ఈ ‘‘అల్లుడు శ్రీను’’ సినిమాను చిత్రీంచడం కోసం ఇంకా ఎక్కువ కష్టం పడ్డారని ఈ చిత్ర ట్రైలర్లు చూస్తే అర్థమవుతుంది’’ అని వినాయక్ ను పొగుడుతూ చెప్పాడు.

అయితే ఇందులో వున్న తప్పేమిటంటే... వివి వినాయక్, చిరంజీవితో కలిసి తీసిన సినిమా ‘‘ఠాగూర్’’. స్టాలిన్ సినిమాను ఏఆర్ మురగదాస్ తీశాడు. అయితే ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన దర్శకుడు రాజమౌళి... ఆ తరువాతి రోజు తన ట్విట్టర్ లో దీనిమీద సారీ చెప్పుకున్నాడు. ‘‘నేను అల్లుడు శ్రీను ఫంక్షన్ లో ఠాగూర్ కి బదులు స్టాలిన్ అని చెప్పాను. నేను చేసిన ఈ తప్పుకు నన్ను క్షమించండి అంటూ సోమవారం సాయంత్రం తన ట్విట్టర్ లో పోస్ట్ చేసుకున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles