Sampunesh babu takes photo with super star rajnikanth

sampunesh babu takes photo with super star rajnikanth, rajnikanth latest news, linga movie latest news, sampunesh babu in linga movie, sampurnesh babu latest news, sampunesh babu with rajnikanth, rajnikanth with sampurnesh babu, sampurnesh babu in linga movie, sampurnesh babu grabs the offer in linga movie

sampunesh babu takes photo with super star rajnikanth

రజినీకాంత్ ను టచ్ చేసిన సంపూబాబు

Posted: 06/28/2014 01:47 PM IST
Sampunesh babu takes photo with super star rajnikanth

(Image source from: sampunesh babu takes photo with super star rajnikanth)

‘‘పోయిస్తా... ఈ చేతుల్తోనే బీప్ పోయిస్తా’’ అంటూ యూట్యూబ్ లో రికార్డులు సృష్టించి, టాలీవుడ్ బర్నింగ్ స్టార్ గా ఎదిగాడు సంపూర్ణేష్ బాబు. ఇంతవరకు ఏ కుర్రహీరోలకు దక్కనంత ఇమేజీని సంపాదించుకున్నాడు. తాను నటించిన మొదటి చిత్రం ‘‘హృదయకాలేయం’’తోనే లక్షలాది అభిమానులను వెనకేసుకున్నాడు. ‘‘పిడుగే పడినా బెదరడు... ఆ పిడుగునే బెదిరిస్తాడు’’ అంటూ టాలీవుడ్ లో ఓ ఊపు ఊపేశాడు. కేవలం టాలీవుడ్ లోనే కాదు.. కోలీవుడ్ వరకు కూడా ఇతని హవా పాకేసింది.

అందుకు ఉదాహరణగా ఈ బర్నింగ్ బాబు... టాలీవుడ్ సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ తాజా సినిమా ‘‘లింగా’’లో నటించనున్నాడనే వార్తలు టాలీవుడ్ లో బలంగా వినిపిస్తాయి. అందులో భాగంగానే ‘‘లింగా’’ సినిమా షూటింగ్ సమయంలో సంపూ బాబు, రజనీకాంత్ తో కలిసి ఒక ఫోటో కూడా దిగాడు. ఆ ఫోటోను తన ట్విటర్ లో పోస్ట్ చేసి.. ‘‘నా జన్మ ధన్యమైపోయింది’’ అంటూ తన ఆనందాన్ని నలుగురితో పంచుకున్నాడు. ఆ ఫోటోను తిలకించిన ప్రేక్షకులు, సినీ వీక్షకులు.. సంపూర్ణేష్ బాబు, రజనీకాంత్ సినిమాలో ఆఫర్ దక్కించుకున్నాడని టోటల్ గా ఫిక్స్ అయిపోయారు.

రజనీకాంత్ తో కలిసి దిగిన ఫోటోను సంపూర్ణేష్ బాబు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో పోస్ట్ చేసి... ‘‘సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి ఫోటో దిగడం నా అదృష్టం. నా జీవితంలో నేను సాధించిన ఒక గొప్ప విషయం. నా జాన్మమే ధన్యమైపోయింది. సూపర్ స్టార్ తో సామాన్యనటుడు’’ అంటూ ట్వీట్ చేశాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న లింగా మూవీ లొకేషన్ లో రజనీకాంత్ తో కలిసి అవకాశాన్ని మోహన్ బాబు కల్పించారని చెప్పాడు. అలాగే రైటర్ బీవీఎస్ రవి, డైరెక్టర్ రాజేత్ తో కూడా కలిసినట్టుగా పేర్కొన్నాడు.

ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు మూడు పాత్రలు పోషిస్తున్న ‘‘కొబ్బరి మట్ట’’ షూటింగ్ లో బిజీగా వున్నాడని... అల్లరి నరేష్ తో కలిసి త్వరలోనే మరో సినిమాలో కనిపించబోతున్నాడని టాలీవుడ్ సమాచారం! ఏదేమైనా సంపూర్ణేష్ బాబు.. తన ఇమేజీని మరింతగా పెంచుకునేందుకు రజనీలాంటి స్టార్ల సహకారాన్ని కోరుకుంటున్నాడని అందరూ గుసగుసలాడుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles