Amala paul shares her honeymoon moments with her friends

Amala paul shares her honeymoon moments with her friends, amala paul latest news, amala paul with her husband, amala paul marriage news, amala paul with her husband news, amala paul honeymoon photos, amala paul honeymoon movements

Amala paul shares her honeymoon moments with her friends

ఆయనతో ఫుల్ గా ఎంజాయ్ చేశాను! -అమలా

Posted: 06/28/2014 01:03 PM IST
Amala paul shares her honeymoon moments with her friends

(Image source from: Amala paul shares her honeymoon moments with her friends)

‘‘మైనా’’ సినిమా ద్వారా డీ-గ్లామర్ పాత్రలో మంచి నటనను ప్రదర్శించిన అమలాపాల్ కు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల నుంచి ఒకదాని తరువాత ఒకటి అంటూ ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చేశాయి. దాంతో ఈ అమ్మడు ఒక్కసారిగా స్టార్ డమ్ ను సంపాదించేసుకుంది. అయితే గత కొన్నాళ్ల క్రితం నుంచి ఈమె సరియైన పాత్రలు లభించడం లేదని, స్ర్కిప్టు సరిగ్గా లేదని అంటూ వచ్చిన అవకాశాలను చేజార్చుకుంటూ వచ్చింది. తీరా ఆరాతీస్తే.. తమిళ దర్శకుడు విజయ్ తో డేటింగ్ చేస్తోందని వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలను నిజం చేస్తూ అమలాపాల్ కూడా స్టేట్ మెంట్లు ఇచ్చేసింది. అనుకోకుండా వీరి పెళ్లి కూడా హఠాత్తుగా జరిగిపోయింది. ఇదీ అమలపాల్ గతం!

కొన్నిరోజుల క్రితమే దర్శకుడు విజయ్ వివాహం చేసుకున్న అమలాపాల్ తానెంతో హ్యాపీగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నానని ప్రకటనలు ఇచ్చేస్తోంది. హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లిన ఈ జంట... తిరిగి ఇండియాకు వచ్చేస్తోంది. అక్కడ గడిపిన విశేషాల గురించి అమలాపాల్ ఎంతో ఎగ్జయిట్ అవుతూ తన ఫ్రెండ్స్ తో నాన్ స్టాప్ గా చెబుతూనే వుందట!

సాధారణంగా అమలాపాల్ కు సాహస క్రీడలంటే చాలా ఇష్టం. అందులో ముఖ్యంగా స్కై డైవింగ్ అంటే మరీ ఇష్టమని గతంలో చెప్పుకుంది. తన హనీమూన్ లో కూడా అమలాపాల్ ఇటువంటి సాహసక్రీడల్లో చాలా ఎంజాయ్ చేశానని పేర్కొంది. అలాగే తన భర్త విజయ్ కి సాహస క్రీడలంటే చాలా భయమని చెప్పుకొచ్చింది. అయితే అతనిలో ఆ భయాన్ని పోగొట్టేందుకు అమలా, తన భర్తను (విజయ్) స్కై డైవింగ్ చేయమని వేడుకుందట! అయితే తాను ఎంత చెప్పినా వినకపోయే సరికి.. అతనికి ఒక పారాషూట్ కట్టి... విమానంపై నుంచి కిందకు తోసేశానని ఉల్లాసంగా చెప్పుకుంటుందని తన ఫ్రెండ్స్ వెల్లడించారు.

‘‘హనీమూన్ కోసం నేను, నా భర్త మాల్దీవులకు వెళ్లొచ్చాం. అక్కడ కాలాన్ని మేమెంతో సరదాగా గడిపాం. పెళ్లి తరువాతే ఆ అమ్మాయి అయినా పరపూర్ణత కలిగిన మహిళ అంటే ఏమిటో తెలుసుకుంటుంది. దానర్థం ఏంటో నాక్కూడా ఇప్పుడు తెలుస్తోంది. నేను, నా భర్తతో కలిసి స్కైడైవింగ్ కూడా చేశాం. ఆయనతో గడిపిన ఆ క్షణాలు నాకొక మంచి అనుభూతిగా భావిస్తున్నాను’’ అని చెప్పిందని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles