Actress richa chadda detained in delhi airport

Bollywood Actress Richa Chadda, New Delhi airport, women, igi, delhi airport, police, security"

Bollywood actress Richa Chadda detained in Delhi airport, questioned for two hours.

ఢిల్లీ ఎయిర్ పోర్టులో నరకం అనుభవించింది

Posted: 06/19/2014 07:32 PM IST
Actress richa chadda detained in delhi airport

సెలబ్రెటీలకు విమానాశ్రయాల్లో చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. గతంలో చాలా మంది ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రీలు చేదు అనుభవాలు ఎదుర్కొన్న సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు మరో బాలీవుడ్ నటి కస్టమ్స్ అధికారులకు బలైంది. విచారణ పేరుతో ఆమెను రెండు గంటల పాటు నిర్బంధించి నరకం చూపించారు. మేటర్లోకి వెళితే నటి రిచా చద్దా ముంబై నుండి ఢిల్లీకి వచ్చింది. ఢిల్లీ విమానాశ్రయ అధికారులు చెక్ ఇన్ సందర్భంగా చేసిన సోదాల్లో రిచా చద్దా బ్యాగ్ లో ఉన్న ఓ వస్తువుపై అనుమానం తలెత్తడంతో అధికారులు ఆమెను నిర్బంధించారు.

చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకునేందుకు సంప్రదాయపద్దతుల్లో తయారైన ఆయుర్వేద పౌడర్ ను వినియోగిస్తున్నట్టు ఆమె వివరణ ఇచ్చినా అధికారులు తృప్తి చెందలేదు. , రెండు గంటల సేపు అధికారులకు దాని గురించి వివరించినా వారిని ఒప్పించే ప్రయత్నం చేసినా లాభం లేక పోయింది. తప్పని సరి పరిస్థితుల్లో దానిని తెరచి చూపేందుకు అంగీకరించింది. చిరవకు ఆమె తెచ్చుకున్నది టాల్కమ్ పౌడర్ అని తేలడంతో ఆమెను వదిలారు. గోలియోంకా రాస్ లీల రామ్ లీల' సినిమాలో దీపికా పదుకునేకు వదినగా రిచా చద్దా నటించింది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles