Venkatesh pawan movie title gopala gopala

Venkatesh Pawan Movie title Gopala Gopala, Oh My God telugu title Gopala gopala, Suresh Babu and Sharat Marrar, pawan kalyan, oh my god, venkatesh, shriya

Venkatesh Pawan Movie title Gopala Gopala, Oh My God telugu title Gopala gopala, Suresh Babu and Sharat Marrar, pawan kalyan, oh my god, venkatesh, shriya

వెంకీ - పవన్ సినిమా టైటిల్ మారింది

Posted: 06/07/2014 12:45 PM IST
Venkatesh pawan movie title gopala gopala

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాడ్ ’ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్, పవన్ కళ్యాణ్ హీరోలుగా రీమేక్ చేయడానికి అంతా సిద్దం చేసిన విషయం తెలిసిందే. త్వరలో ప్రారంభోత్సవం జరుపుకోబోతున్న ఈ సినిమా తెలుగు టైటిల్ ఇదే అంటూ రోజుకో వార్త వెలువడుతుంది టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి. ఈ సినిమాకు మొదట్లో ‘ఓరి దేవుడా ’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. తరువాత పవన్ కళ్యాణ్ సినిమా అత్తారింటికి దారేది సినిమాలోని ‘దేవ దేవం ’ పాటను టైటిల్ గా మార్చారని ఇదే టైటిల్ ని ఫైనల్ చేశారని కూడా వార్తలు వచ్చాయి.

కానీ ఇప్పుడు ఆ సినిమా టైటిల్ మళ్ళీ మారందని సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రానికి ‘గోపాలా గోపాలా' అనే టైటిల్ ని పెట్టాలని అనుకుంటున్నారట. త్వరలో అఫీషియల్ ప్రకటన కూడా వెలువడుతుందని అంటున్నారు. ఓ మై గాడ్‌' సినిమాలో అక్షయ్ కుమార్, పరేష్ రావల్ నటించారు. తెలుగులో అక్షయ్ కుమార్ పాత్రను పవన్ కళ్యాణ్, పరేష్ రావల్ పాత్రను వెంకటేష్ చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక దాదాపుగా పూర్తయింది. వెంకీ జోడీగా శ్రీయను ఎంపిక చేసారు. అదే విధంగా వెంకీ అసిస్టెంట్ పాత్రకు కృష్ణుడిని తీసుకున్నారు.

సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ, నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్లలో సురేష్ బాబు, శరత్ మరార్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మించబోతున్నారు. ‘తడాఖా' ఫేం డాలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తారు. ఏది ఏమైనా ఈ చిత్ర యూనిట్ నుండి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles