Allu arjun third film under sukumar direction

Allu Arjun third film under Sukumar direction, Sukumar, allu arjun and Sukumar, Allu Arjun under sukumar direction, Allu Arjun movies,allu arjun films,Allu Arjun

Allu Arjun third film under Sukumar direction, Sukumar, allu arjun and Sukumar, Allu Arjun under sukumar direction, Allu Arjun movies,allu arjun films,Allu Arjun

సుక్కుతో మూడోసారి బన్నీ

Posted: 06/07/2014 11:09 AM IST
Allu arjun third film under sukumar direction

బాలీవుడ్ దర్శకులంతా ఇప్పుడు స్టైలిష్ స్టార్ అర్జున్ వెంట పడుతున్నట్లు ఉంది. ఇటీవలే రేసు గుర్రం సినిమా హిట్ తో మంచి ఫాంలో ఉన్న అర్జున్ తో ఇటీవలే త్రివిక్రమ్ సినిమా ప్రారంభించగా, ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా తీయడానికి రెడీ అయ్యాడు ప్రేమకథా చిత్రాల దర్శకుడు సుకుమార్. అల్లు అర్జున్ కి ‘ఆర్య ’ సినిమాతో మంచి బ్రేక్ ఇచ్చిన సుకుమార్ అంటే ఎంతో నమ్మకం.

అందుకే ఇటీవల మహేష్ తో చేసిన సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టిన ఆయన పై ఉన్న నమ్మకంతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తన సొంత బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించబోతున్నట్లు సమాచారం. బన్నీ నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో  సుకుమార్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయ్యినట్లు తెలుస్తోంది. కామెడీ, కమర్షియల్ అంశాలతో ఈచిత్రం ఉండబోతోంది.

రేసుగుర్రం తరువాత త్రివిక్రమ్ సినిమాకు కటీట్ అయ్యిన బన్నీ గతంలో ‘జులాయి ’ సినిమా చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో బన్నీ ఈ మాటల మాంత్రికుడికే మొగ్గు చూపాడని అంటున్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే... ఈ సినిమా త్రివిక్రమ్ ముగ్గురు కథానాయికల్ని తీసుకున్నాడట. ఇప్పటికే  సమంత, ప్రణీతలను తీసుకోగా, తాజాగా మహేష్ ‘1 నేనొక్కడినే ’ సినిమా హీరోయిన్  క్రితి సానన్‌ను తీసుకున్నట్లు సినిమా వర్గాల సమాచారం.

ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించబోతున్నడంగా హారిక హాసిని క్రియేషన్స్‌ పై ఈ చిత్రం తెరక్కెబోతుంది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles