Chiru in uyyalawada narasimha reddy roll

Chiru as Uyyalawada Narasimha Reddy roll, Megastar 150th film roll, Chiru, chiranjeevi, 150th film, Uyyalawada Narasimhareddy, chiru 150th film begins, chiranjeevi to start 150th film

Megastar 150th film will be based on the life and times of Uyyalawada Narsimha Reddy, a village chieftain who lead a rebellion against the British in 1846.

రాయలసీమ పోరాట యోధుడి పాత్రలో చిరు

Posted: 05/26/2014 10:16 AM IST
Chiru in uyyalawada narasimha reddy roll

మెగాస్టార్ చిరంజీవికి కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలవ్వడంతో రాజకీయాల్లో పనిలేకుండా పోయింది. దీంతో ఆయన మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి తన 150వ సినిమాను పూర్తి చేస్తాడని గత కొన్ని రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. మరి చిరు చేయబోయే సినిమా ఎలా ఉంటుంది ? ఆయన ఎలాంటి పాత్రలో నటించబోతున్నాడు ? ఆ సినిమాకు ఎవరు దర్శకత్వం వహించబోతున్నారనే ఉత్కంఠ మెగా అభిమానుల్లో నెలకొంది.

అయితే సినిమా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం  ఓ విప్లవ వీరుని పాత్రలో బ్రిటిష్ పాలకులను ఎదిరించి నిలిచి, చివరికి ఆ తెల్లదొరల చేతిలో ఉరిశిక్షకు గురైన రాయలసీమ పోరాటయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ’ కథను ఇందుకు చిరు ఎంచుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

 

దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పరుచూరి బ్రదర్స్ నేతృత్వంలో ప్రస్తుతం నడుస్తోందనీ, చిరు బర్త్ డే అయిన ఆగష్టు 22న ఈ చిత్రాన్ని ప్రారంభిస్తారనీ సమాచారం. ఈ చిత్రానికి వి.వి. వినాయక్ దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. ఇటీవల మణిరత్నం కూడా ఓ కథను వినిపించాడని చిరు చెప్పుకొచ్చాడు.

చాలా రోజుల తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న చిరు సమాజానికి సందేశాన్ని ఇచ్చే పాత్రగానీ, ఒకప్పటి యాక్షన్, రొమాంటిక్ పాత్రలు గానీ చేస్తే అభిమానులు కాస్తంత సంతోషపడతారు కానీ, అందరికి తెలిసిన నరసింహారెడ్డి పాత్రలో నటిస్తే ఎవరు చూస్తారని , చిరు ఇలాంటి పాత్ర చేయడం అవసరమా అనే ప్రశ్నలను లేవలెత్తున్నారు.

 

చిరు 150 చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తాడని ఎప్పటి నుండో అంటున్న ఇటీవల ఆయన కూడా తప్పుకున్నాడని వార్తలు. ఏది ఏమైనా చిరు సినిమా రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో అధికారిక ప్రకటన వస్తేగానీ ఏది నమ్మలేం. అప్పటి వరకు ఇలాంటి వార్తలు చదువుతూ ఎంజాయ్ చేయండి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles