Sudeep in attarintiki daredi kannada remake

Sudeep in attarintiki daredi kannada remake, udeep in attarintiki daredi kannada remake, attarintiki daredi kannada remake, sudeep next remake movie, sudeep latest telugu remake movie, kannada actor sudeep movie news, sudeep movie news, kannada movie news, attarintiki daredi movie kannada rights, attarintiki daredi kannada remake details, pawan kalyan attarintiki daredi kannada remake, pawan kalyan attarintiki daredi movie latest news, actor sudeep

kannada hero Sudeep in attarintiki daredi kannada remake, udeep in attarintiki daredi kannada remake, attarintiki daredi kannada remake, sudeep next remake movie, sudeep latest telugu remake movie, kannada actor sudeep movie news, sudeep movie news, kannada movie news, attarintiki daredi movie kannada rights, attarintiki daredi kannada remake details, pawan kalyan attarintiki daredi kannada remake, pawan kalyan attarintiki daredi movie latest news, actor sudeep

పవన్ సినిమా పై ఈగ విలన్ కన్ను

Posted: 05/23/2014 06:37 PM IST
Sudeep in attarintiki daredi kannada remake

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ సినిమా ద్వారా టాలీవుడ్ కు విలన్ గా పరిచయమైన ప్రముఖ కన్నడ నటుడు సుదీప్ కన్ను ప్రస్తుతం 2013 టాలీవుడ్ సినిమాలపై పడింది. 2013వ సంవత్సరంలో తెలుగులో ఘనవిజయం సాధించిన చిత్రాలపై ఈ విలన్ ఎటాక్ చేస్తున్నాడు. 2013 ప్రారంభానికి తన ‘మిర్చి’ సినిమాతో ప్రభాస్ ఓ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించాడు. ప్రభాస్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా మిర్చి నిలిచింది. అంతే కాకుండా కథలో రెండు రకాల వైవిధ్యమైన పాత్రలతో అభిమానులను అలరించాడు ప్రభాస్. అయితే ఇంతటి ఘనవిజయం సాధించిన మిర్చి చిత్రాన్ని కన్నడలో ‘మాణిక్య’ అనే పేరుతో రీమేక్ చేసి, ఇటీవలే విడుదల చేశారు. కన్నడలో ఈ సినిమా మంచి విజయం సాధించి, సుదీప్ కు మరింత పేరును తెచ్చిపెట్టింది. అయితే ఈ విలన్ కన్ను ఇపుడు పవన్ అత్తారింటిపై పడింది.

ఎన్నో వాయిదాలు పడుతూ, సినిమా విడుదలకు ముందే పైరసీ అయినా కూడా ఘనవిజయం సాధించి పవన్ కళ్యాణ్ సినీకెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రం ‘అత్తారింటికి దారేది’. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా 2013లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే ఈ చిత్రాన్ని కన్నడంలో రీమేక్ చేయాడానికి సుదీప్ ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసింది.

కన్నడ రీమేక్ హక్కుల కోసం ఈ చిత్ర నిర్మాత అయినటువంటి బివిఎస్ఎన్ ప్రసాద్ తో సుదీప్ సంప్రదింపులు జరుపుతున్నాడని తెలిసింది. త్వరలోనే కన్నడ హక్కులను సొంతం చేసుకొని, ఈ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ ఈ రీమేక్ కన్నడలో కూడా ఘనవిజయం సాధిస్తే ఇక సుదీప్ కన్నడ హీరోల్లో నెంబర్ 1 స్థానంలో ఉండటం ఖాయమని తెలుస్తుంది. మరి కన్నడలో ఈ అత్తారిల్లు ఎలా ఉండబోతుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles