Manchu manoj love story

manchu manoj birthday special, manchu manoj talks about love, manchu manoj marriage details, manchu manoj love story, manchu manoj current teega, manchu manoj birthday special interview, manchu manoj special news, manchu manoj, manchu manoj movie news, manchu manoj birthday special articles, manchu manoj movies, telugu movie news,

ప్రేమలో పడిన మంచు మనోజ్

Posted: 05/20/2014 10:18 AM IST
Manchu manoj love story

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో మంచు మనోజ్ ఏం చేసినా కూడా అతనిలో ఎనర్జీ తగ్గదు. సినిమా సినిమాకు కొత్తదనం చూపించడంలో మనోజ్ ఎప్పుడూ కూడా ముందు ఉంటాడు. అలాంటి ఈ హీరో పుట్టినరోజు నేడు.

తెలుగు సినీపరిశ్రమలో తన వయస్సు వారందరకీ కూడా దాదాపుగా పెళ్లిళ్లు అయ్యాయి. గతకొద్దికాలంగా పెళ్లి విషయం చెప్పకుండా వాయిదాలు వేస్తున్న ఈ కుర్ర హీరో తన పుట్టినరోజు సంధర్భంగా తన మొదటి ప్రేమకథను బయటపెట్టాడు. మనోజ్ తన లవ్ స్టోరీ గురించి చెబుతూ... ‘‘నేను రెండుసార్లు ప్రేమలో పడ్డాను. మొదటి ప్రేమ ఎనిమిదో తరగతి అప్పుడు. ఆ ప్రేమ ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు సాగింది. ఒక సంవత్సరం వన్ సైడ్ లవ్ లా సాగింది. ఆ తర్వాత ఆ అమ్మాయి నా ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇద్దరం లవ్ లెటర్స్ రాసుకునే వాళ్లం. ఇంటర్ తర్వాత పై చదువుల కోసం ఆమె అమెరికా వెళ్లింది. మా ప్రేమకు అప్పుడే ఫుల్ స్టాప్ పడింది. ఆ తర్వాత కాలేజ్ లో ఇంకో అమ్మాయిని ప్రేమించాను. కానీ అవన్నీ నిజమైన ప్రేమలు కావనీ ఇప్పుడనిపిస్తోంది’’ అని తెలిపాడు.

అసలే పెళ్లి వయసులో ఈ కుర్రోడిపై అటు కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటుగా ఇటు అభిమానులు కూడా మనోజ్ పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న ‘‘కరెంట్ తీగ’’ సినిమా తర్వాత మనోజ్ కు ఎలాగైనా పెళ్లి చేసేయ్యాలని మంచు కుటుంబం భావిస్తుంది. మరి ఈ మంచు బాబు ఎప్పుడు వరుడుగా మారతాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles